బిజినెస్

అమ్మకాల ఒత్తిడిలో బ్యాంకుల షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: వివిధ బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. బుధవారం స్టాక్ మార్కెట్లలో బ్యాంక్‌ల షేర్లే ఎక్కువగా పతనమయ్యాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ వాటాలు ఏకంగా 23.90 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్ (11.23 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (9.92 శాతం), ఫెడరల్ బ్యాంక్ (6.79 శాతం), సిటీ యూనియన్ బ్యాంక్ (5.22 శాతం), యాక్సిస్ బ్యాంక్ (3.36 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (2.96 శాతం), ఎస్‌బీఐ (0.12 శాతం) చొప్పున నష్టాలను ఎదుర్కొన్నాయి. నిరర్ధక ఆస్తులు, మొండి బకాయిలు పెరుగుతున్న కారణంగా బ్యాంకుల షేర్లపై మదుపరులు ఆసక్తిని చూపలేదు. తమ వద్ద ఉన్న వాటాలను అమ్మడానికే వారు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో భారీ పతనం తప్పలేదు.