బిజినెస్
సరఫరాలో అంతరాయం ఉండొద్దు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 18: రక్షిత ముసుగులు, చేతి తొడుగులు, చేతుల శానిటైజర్ల తయారీదారులు, దిగుమతిదారులు తమ వద్ద ఉన్న నిల్వల గురించి సాయంత్రం 6గంటలలోగా సమాచారాన్ని అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జాతీయ ఔషధ ధరల అథారిటీ (ఎన్‌పీపీఏ) హెచ్చరించింది. రక్షిత ముసుగులు, చేతి తొడుగులు, చేతుల శానిటైజర్ల తయారీదారులు తమ వద్ద ఏ మేరకు నిల్వలు ఉన్నాయో ఈ నెల 17వ తేదీలోగా తమకు అందించాల్సిందిగా గత వారం ఆదేశించడమైందని ఎన్‌పీఏఏ తెలిపింది.
అయితే దీనికి చాలా తక్కువ సంఖ్యలో తయారీదారులు, దిగుమతిదారులు స్పందించారని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. మిగతా కంపెనీలు వెంటనే సమాచారాన్ని అందించకపోతే తాము కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవసరాలకు అనుగుణంగా సరఫరా చేయని పక్షంలో నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద చర్య తీసుకుంటామని హెచ్చరించింది.
రక్షిత ముసుగులు, శానిటైజర్లను రాబోయే వంద రోజుల వరకు నిత్యావసర వస్తువులుగా పరిగణిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13న ప్రకటించిందని ఎన్‌పీపీఏ తెలిపింది.