బిజినెస్

‘బేర్’ గుప్పిట్లోనే మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 18: కరోనా వైరస్ భయం నుంచి ప్రపంచ మార్కెట్లు ఇంకా బయటపడలేదు. మదుపరులు ముందుజాగ్రత్త చర్య లు తీసుకుంటున్న కారణంగా స్టాక్ మార్కెట్లకు భారీ నష్టా లు తప్పడం లేదు. అంతర్జాతీయ సూచీలు కూడా నిరాశాజనకంగా ఉండడంతో బుధవారం భారత స్టాక్ మార్కెట్లు తీవ్రమైన ఆటుపోట్లకు గురయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ) లో సెనె్సక్స్ 1,709.58 పాయింట్లు (5.59 శాతం) నష్టపోయి 28,869.51 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకానొక దశలో నష్టం 2,488.72 పాయిం ట్ల వరకు వెళ్లింది. అయితే, దేశీయ మదుపరులు తక్కువ ధరల వద్ద కొన్ని కంపెనీల షేర్లను కొనుగోలు చేసేందుకు ఉత్సాహపడడంతో నష్టం కొం తమేర తగ్గింది. కాగా, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 498.25 పాయింట్లు (5.56 శాతం) పతనమై 8,468.80 పాయింట్లకు చేరింది. సెనె్సక్స్ ప్యాక్‌లో ఇండస్‌ఇండ్ అత్యధికంగా, 23 శాతం నష్టపోయింది. ఈ కంపెనీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మొదటి నుంచీ చివరివరకూ నష్టాల్లోనే ట్రేడయ్యాయి. పవర్ గ్రిడ్ షేర్లు 11.29, కోటక్ మహీంద్రా షేర్లు 11.23, బజాజ్ ఫైనాన్స్ వాటాలు 11.11 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి. అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాటా ధర 9.92 శాతం పతనమైంది. హీరో మోటార్స్ 7.86 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 7.47 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 7.37 శాతం, టైటాన్ 7.12 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ సూచీల ప్రతికూల ధోరణులే ఈ పతనానికి కారణమని విశే్లషకులు అంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు వ్యాపించడంతో ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయి. దీంతో తమ వద్ద ఉన్న షేర్లను అమ్మడానికి మదుపరులు ఉత్సాహం చూపెడుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగానే ఆసియా పసిఫిక్ ఆర్థిక వృద్ధి అత్యంత కనిష్టంగా 3 శాతానికి పడిపోయింది. షాంఘై, హాంకాంగ్, సియోల్, టోక్యో తదితర స్టాక్ మార్కెట్లు సగటున 4.86 శాతం నష్టపోయాయి. 2008 తర్వాత అమెరికాలో ఎన్నడూ లేనివిధంగా మాంద్య పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిస్థితిని చక్కబెట్టేందుకు ఒక ట్రిలియన్ డాలర్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. అగ్రదేశానికే ఇలాంటి సమస్య ఉత్పన్నమైతే మిగతా దేశాల ఆర్థిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఊహించడం కష్టంగా ఉంది. మరోవైపు రూపాయి మారకం విలువ మరోసారి పతనమైంది. 12 పైసలు తగ్గడంతో ఫోరెక్స్ మార్కెట్‌లో డాలర్ విలువ 74.36 రూపాయలకు చేరింది. బ్రెంట్ ముడిచమురు ధర బ్యారల్‌కు 3.48 శాతం (27.73 డాలర్లు) తగ్గింది. ఈ పతనం కూడా స్టాక్ మార్కెట్‌కు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నది.