బిజినెస్

రిల్‌లో పెరిగిన ముఖేష్ షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్)లో ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ తమ ఏర్లను స్వల్పంగా పెంచుకున్నారు. వారి ముగ్గురు పిల్లల వాటాలు కూడా పెరిగాయి. ప్రమోటర్ గ్రూప్ షేర్ హోల్డింగ్ కింద ప్రస్తుతం ఉన్న 47.45 శాతం ఆయిల్ టు టెలికాం వాటాల్లో ఎలాంటి మార్పు లేదని రెగ్యులేటర్ ఫైలింగ్‌లో దేవర్షి కమర్షియల్స్ ఎల్‌ఎల్‌పీ ప్రకటించింది. అయితే, ఒక ప్రమోటర్ షేర్ హోల్డింగ్ కంపెనీ అంబానీ కుటుంబానికి షేర్లను విక్రయించింది. ముఖేష్ అంబానికి ఇంత ముందు వరకూ 72.31 లక్షల షేర్లు (రిల్ కంపెనీలో ఇది 11.21 శాతం) ఉన్నాయి. కొత్తగా 0.12 శాతం షేర్లను కొనడంతో, ఆయన వద్ద ఉన్న వాటాలు 75 లక్షలకు పెరిగాయి. అదే విధంగా నీతా అంబానీకి 67.96 షేర్లు ఉండగా, కొత్త కొనుగోళ్ల తర్వాత అవి 75 లక్షలకు చేరాయి. కవలలైన ఆకాశ్ అంబానీ, ఇషా వద్ద ఉన్న వాటాల సంఖ్య కూడా 67.2 లక్షల నుంచి 75 లక్షలకు పెరిగింది. చిన్న వాడైన అనంత్‌కు ఇప్పటి వరకూ రిల్‌లో కేవలం రెండు లక్షల షేర్లు మాత్రమే ఉన్నాయి. అతను ఇప్పుడు 73 లక్షల షేర్లను కొనడంతో, కుటుంబంలోని మిగతా సభ్యుల మాదిరిగానే 75 లక్షల వాటాలకు చేరారు. మొత్తం మీద ముఖేష్ అంబానీ, ఆయన భారీ నీతా, పిల్లలు ఆకాశ్, ఇషా, అనంత్ రిల్‌లో సమాన సంఖ్యలో వాటాలు కలిగి ఉండడం ఇదే మొదటిసారి.