బిజినెస్

‘బేర్’ దెబ్బకు కంపెనీలు విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: భారత స్టాక్ మార్కెట్లలో గత వారం బేర్ ఆధిపత్యం కొనసాగడంతో, దేశంలోని అతి పెద్ద కంపెనీలు విలవిల్లాడాయి. ‘టాప్-10’ కంపెనీల మార్కెట్ విలువ సుమారు 3.63 లక్షల కోట్ల రూపాయలు తగ్గిందంటే ప్రతికూల పరిస్థితులు ఏ స్థాయిలో మార్కెట్లను దెబ్బతీస్తున్నాయో ఊహించుకోవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్)ను రెండో స్థానానికి నెట్టిన టాటా కన్సల్టెన్సీ లిమిటెడ్ (టీసీఎస్) నంబర్ వన్‌గా ఎదగడం విశేషం. మార్కెట్ గణాంకాల ప్రకారం గత వారం టాప్-10 కంపెనీల నష్టం అక్షరాలా 3,63,884.03 కోట్ల రూపాయలు. కరోనా వైరస్ కారణంగా గత వారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లావాదేవీలు భారీ నష్టాలను చవిచూడగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ భారీగా నష్టపోయింది. ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్న హిందుస్థాన్ యూనీలెవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), ఇండియన్ టొబాకో కంపెనీ (ఐటీసీ) మాత్రమే మార్కెట్ విలువను పెంచుకోగలిగాయి. హెడ్‌యూఎల్ మార్కెట్ విలువ 1,03,470.28 కోట్ల రూపాయలు పతనమై, 4,83,720.15 కోట్ల రూపాయలుగా స్థిరపడింది. అదే విధంగా ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ 65,853.55 కోట్ల రూపాయల తగ్గడంతో 2,23,753.14 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇతర కంపెనీల మార్కెట్ విలువ పతనాన్ని గనమిస్తే, రిల్ 54,961.45 కోట్ల రూపాయల పతనంతో 6,46,732.07 కోట్ల రూపాయలకు, హెచ్‌డీఎఫ్‌సీ 54,479.15 కోట్ల నష్టంతో 3,03,722.13 కోట్ల రూపాయలకు, కోటక్ మహీంద్ర బ్యాంక్ 39,626.31 కోట్ల నష్టంతో 2,41,611.45 కోట్ల రూపాయలకు, ఇన్ఫోసిస్ 24,382.12 కోట్ల పతనంతో 2,49,123.50 కోట్ల రూపాయలకు పడిపోయాయి. భారతి ఎయిర్‌టెల్ విలువ 17,621.45 కోట్ల రూపాయల తగ్గి, 2,51,992.19 కోట్ల రూపాయలుగా స్తిరపడింది. టీసీఎస్ విలువ 3,489.72 కోట్ల రూపాయలు నష్టంతో 6,74,678.77 కోట్ల రూపాయలకు చేరింది. కాగా, ఐటీసీ మార్కెట్ విలువ 16,367.12 కోట్ల రూపాయలు పెరగడంతో, 2,15,790.12 కోట్ల రూపాయలకు చేరింది. హెచ్‌యూఎల్ 4,178.10 కోట్ల రూపాయలను పెంచుకొని, 4,44,329.52 కోట్ల రూపాయలకు ఎదిగింది. టాప్ టెన్ కంపెనీల జాబితాలో చాలాకాలంగా మొదటి స్థానంలో కొనసాగుతున్న రిల్‌ను ఐటీసీ రెండో స్థానానికి నెట్టేసింది. ఈ జాబితాలో ఐటీసీ, రిల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొదటి మూడు స్థానాలను ఆక్రమించాయి. నాలుగు నుంచి పది స్థానాల్లో వరుసగా హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతి ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ ఉన్నాయి.