బిజినెస్

ఎన్టీపిసిలో 46,653 మెగావాట్ల రికార్డు స్థాయి విద్యుదుత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: ఎన్టీపిసి గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో రికార్డు స్థాయిలో 46,653 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు ఆ సంస్థ శుక్రవారం ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అలాగే 2015-16లో అదనంగా 2,225 మెగావాట్ల సామర్థ్యంగల ప్రాజెక్టులు విద్యుదుత్పత్తిని ప్రారంభించాయ. మరోవైపు సౌర విద్యుదుత్పత్తి రంగంలో గరిష్ఠ స్థాయిలో 160.8 ఎంయు విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. దేశంలోని ఎక్కువ స్థాయిలో పిఎల్‌ఎఫ్‌ను సాధించిన తొలి 5 థర్మల్ ప్లాంట లలో 4 ఎన్టీపిసికి చెందినవే కావడం గర్వకారణంగా ఉందని ఎన్టీపిసి పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)తో 12వ పంచవర్ష ప్రణాళిక ముగుస్తుందని, 11,920 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యాన్ని చేరుకుంటామంది.

రామగుండం ఎన్టీపిసి మరో రికార్డు
గోదావరిఖని: 2015-16 ఆర్థిక సంవత్సరంలో రామగుండం ఎన్టీపిసి నిర్ణయించిన వార్షిక ఉత్పత్తి 20,030 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని జరిపి మరో రికార్డును సాధించి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో అగ్రగామిగా నిలిచింది. శుక్రవారం రామగుండం ఎన్టీపిసి ఇడి మహాపాత్ర రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి కోసం కృషి చేసిన ఉద్యోగులందరికి అభినందనలు తెలిపారు. 20,030 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి, మార్చి 31 అర్ధరాత్రి వరకు 20, 250.096 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిపి 88.67శాతం పిఎల్‌ఎఫ్‌తో ముందంజలో ఉన్నామన్నారు. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో అవార్డులను పొందేందుకు అర్హత సాధించిందన్నారు. అదేవిధంగా ఎన్టీపిసి వద్ద గల 10 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులో 2015-16 ఆర్థిక సంవత్సరంలో 16.040 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిపి 18.26 శాతం పిఎల్‌ఎఫ్ సాధించిందన్నారు. కాగా, 2015-16లో రామగుండం అవలెబులిటి ఫ్యాక్టర్(ఎబిటి) 94.22 శాతం జరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరాల్లో కూడా గడువుకు ముందే ఉత్పత్తిని జరిపి రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తులు చేపట్టింది.