బిజినెస్

రూ. 325 తగ్గిన బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: బంగారం ధరలు శనివారం తగ్గుముఖం పట్టాయి. గురు, శుక్రవారాల్లో పెరిగిన ధర.. శనివారం మాత్రం పడిపోయింది. వారం రోజులకుపైగా కనిష్ట స్థాయిని తాకుతూ 325 రూపాయలు దిగి 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 31,200 రూపాయలుగా నమోదైంది. 99.5 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర 31,050 రూపాయలుగా ఉంది. కాగా, అంతకుముందు రెండు రోజుల్లో బంగారం ధర 225 రూపాయలు పెరిగినది తెలిసిందే. ఇకపోతే వెండి ధర విషయానికొస్తే శుక్రవారం ముగింపుతో పోల్చితే కిలో 45,500 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. విదేశీ మార్కెట్‌లో తగ్గిన డిమాండ్, దేశీయ మార్కెట్‌లో నగల వర్తకులు, రిటైలర్ల నుంచి ఆదరణ లేకపోవడం పసిడి ధరల పతనానికి కారణమని బులియన్ వర్గాలు విశే్లషిస్తున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు పసిడి ధర 0.30 శాతం పడిపోయి 1,315.90 డాలర్లుగా ఉంది.