బిజినెస్

ఆటో రంగానికి ‘పండగ’ కిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: దేశీయ ఆటో రంగంలో పండగ సీజన్ అమ్మకాలు మొదలయ్యాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటం, వ్యాపార అవకాశాలు మెరుగుపడుతుండటంతో వాహన విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే గత నెల సెప్టెంబర్‌లో మారుతి సుజుకి రికార్డు స్థాయిలో విక్రయాలు జరిపింది. 1,37,321 యూనిట్లను అమ్మగా, నిరుడు సెప్టెంబర్‌లో 1,06,083 యూనిట్లుగానే నమోదయ్యాయి. టాటా మోటార్స్ దేశీయ అమ్మకాలు కూడా ఈసారి 5 శాతం పెరిగి 42,961 యూనిట్లుగా నమోదయ్యాయి. మహీంద్ర అండ్ మహీంద్ర విక్రయాలు సైతం 7 శాతం పెరిగి గతంతో చూస్తే 39,693 యూనిట్ల నుంచి 42,545 యూనిట్లకు పెరిగాయి. అలాగే టొయోటా అమ్మకాలు ఈసారి 12,067 యూనిట్లుగా ఉంటే నిరుడు 11,376 యూనిట్లుగా ఉన్నాయి. ఫోర్డ్ ఇండియా అమ్మకాలు 9 శాతం వృద్ధితో 8,274 యూనిట్ల నుంచి 9,018 యూనిట్లకు చేరాయి. విఇ కమర్షియల్ అమ్మకాలు 14 శాతం పెరిగి 4,248 యూనిట్ల నుంచి 4,843 యూనిట్లకు చేరాయి. అయితే హోండా కార్స్ విక్రయాలు మాత్రం 19 శాతం క్షీణించి నిరుడుతో పోల్చితే 18,509 యూనిట్ల నుంచి 15,034 యూనిట్లకు పడిపోయాయి. అశోక్ లేలాండ్ అమ్మకాలు కూడా 18 శాతం దిగజారి 14,783 యూనిట్ల నుంచి 12,057 యూనిట్లకు క్షీణించాయి. అలాగే ఎస్‌ఎమ్‌ఎల్ ఇసుజు అమ్మకాలూ 1,032 యూనిట్ల నుంచి 977 యూనిట్లకు దిగజారాయి. ద్విచక్ర వాహన విభాగంలో యమహా మోటార్ విక్రయాలు 33 శాతం ఎగిసి గతంతో చూస్తే 67,267 యూనిట్ల నుంచి 89,423 యూనిట్లకు పెరిగాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు కూడా 30 శాతం పెరిగి 43,741 యూనిట్ల నుంచి 56,958 యూనిట్లను తాకాయి.
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: మునుపెన్నడూ లేనివిధంగా భారీ స్థాయిలో నిర్వహిస్తున్న స్పెక్ట్రమ్ వేలంలో తొలి రోజైన శనివారం 53,531 కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. 700 మెగాహెట్జ్, 900 మెగాహెట్జ్ మినహా మిగతా అన్ని మెగాహెట్జ్ తరంగాల కోసం టెలికామ్ సంస్థలు పోటీపడ్డాయి. ఐదు రౌండ్ల బిడ్డింగ్ ముగిసే సరికి 53,531 కోట్ల రూపాయల విలువైన బిడ్లు వచ్చినట్లు అధికార వర్గాలు పిటిఐకి తెలిపాయి. సోమవారం వేలం మళ్లీ మొదలవనుండగా, శనివారం నాటి వేలంలో 2జి, 4జికి అనువైన 1,800 మెగాహెట్జ్‌కు అత్యధిక బిడ్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత 2,100, 2,500, 2,300, 800 మెగాహెట్జ్‌ల కొనుగోలుకు టెలికామ్ సంస్థలు ఆసక్తి కనబరిచాయి.