బిజినెస్

జెబ్రానిక్స్ నుంచి సరికొత్త సౌండ్‌బార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: ఐటి ఉపకరణాల తయారీలో మేటి సంస్థ జెబ్రానిక్స్ మరో సరికొత్త గాడ్జెట్‌తో మార్కెట్లోకి వచ్చింది. యువతరాన్ని ఆకట్టుకునేందుకు కొత్తరకం సౌండ్‌బార్‌ను తీసుకువచ్చింది. వండర్‌బార్‌గా వ్యవహరిస్తున్న దీనిలో జెబ్రానిక్స్ రెండు స్పీకర్ డ్రైవ్‌లను ఏర్పాటు చేసింది. ఒక్కోక్కటీ 5.08 సెంటీమీటర్ల సైజుతో 10 వాట్ల అవుట్‌పుట్‌ని ఇస్తాయి. బిల్టిన్ ఎఫ్‌ఎమ్ రేడియోతోపాటు బ్లూటూత్ సౌకర్యం ఉండటం దీని మరో ప్రత్యేకత. స్లీక్‌గా ఉన్న ఈ సౌండ్‌బార్‌ను తేలిగ్గా గోడకు బిగించుకోవచ్చు. రిమోట్‌తో ఆపరేట్ చేసే వెసులుబాటు ఉండటం వల్ల ఇంట్లో ఎక్కడినుంచైనా ఆన్, ఆఫ్ చేయొచ్చు. అలాగే 8 మీటర్ల దూరం వరకూ ఇతర బ్లూటూత్ డివైస్‌లతో కనెక్ట్ చేసుకునే సౌకర్యం ఉంది. దీని ధర 1616 రూపాయలు.