బిజినెస్

నూతన రుణ హామీ పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణ రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం నూతన రుణ హామీ పథకాన్ని తీసుకురానున్నట్లు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి అరవింద కుమార్ తెలిపారు. మంగళవారం ఇక్కడ ఈసిజిసి సంస్థ ఏర్పాటు చేసిన బీమా అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నూతన రుణ హామీ పథకం వల్ల బ్యాంకులు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు నిధులు అందించేందుకు ముందుకు వస్తాయని తెలియజే శారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన పారిశ్రామిక విధానం దేశంలోనే అత్యుత్తమమైనదన్న ఆయన పూర్తిగా పారదర్శక విధానంలో పారిశ్రామిక అనుమతులు ఆన్‌లైన్ విధానంలో ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రం నూతన ఒరవడిని తీసుకువచ్చిందన్నారు. రాష్ట్రంలో అధికంగా ఉన్న పట్టణ జనాభాను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే ఎగుమతుల ప్రోత్సాహక విధానాన్ని తీసుకు వస్తామని, దీనిలో ఎగుమతులను ప్రోత్సహించేందుకు తగిన విధి విధానాలను రూపొందిస్తామని స్పష్టం చేశారు. ఐఆర్‌డిఎఐ చైర్మన్ టిఎస్ విజయన్ మాట్లాడుతూ బీమా రంగంలో వస్తున్న మార్పులను వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈసిజిసి అధ్యక్షురాలు గీతా మురళీధర్ మాట్లాడుతూ ఎగుమతులకు సంబంధించి బీమా వ్యాపారంలో మరింత వృద్ధి సాధించాల్సి ఉందన్నారు. ఎగుమతులు, బీమాకు సంబంధించి వినియోగదారులు, బ్యాంకుల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆమె బదులిచ్చారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ కమిషనర్ మాణిక్ రాజ్ పరిశ్రమల విధానాలను వివరించారు.

తొలిరోజు 35 శాతం సబ్‌స్క్రైబ్

ముంబయి, డిసెంబర్ 8: ఆల్కెమ్ లాబొరేటరీస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) ఇష్యూ తొలిరోజైన మంగళవారం 35 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యింది. 1,350 కోట్ల రూపాయల నిధుల సమీకరణే లక్ష్యంగా 90,87,084 షేర్లతో ఆల్కెమ్ ఐపిఒ స్టాక్ మార్కెట్‌లోకి రాగా, 31,68,872 షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు వివరాలను అందించింది. కాగా, ఇప్పటికే అబుదబీ ఇనె్వస్ట్‌మెంట్ ఫండ్ తదితర యాంకర్ ఇనె్వస్టర్ల నుంచి 395 కోట్ల రూపాయల నిధులను ఆల్కెమ్ లాబొరేటరీస్ సమీకరించింది.

ఏడేళ్ల కనిష్టానికి చమురు ధర

సింగపూర్, డిసెంబర్ 8: అంతర్జాతీయ మార్కెట్‌లో మంగళవారం ముడి చమురు ధరలు ఏడేళ్ల కనిష్టానికి పడిపోయాయి. బ్యారెల్ ధర దాదాపు 35 డాలర్లుగా నమోదైంది. అమెరికా క్రూడ్ ఇనె్వంటరీస్ విడుదలవుతున్న క్రమంలో, ఆ దేశ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను పెంచనున్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. మరోవైపు చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలు తాము ఉత్పత్తిని ఆపబోమని తేల్చి చెప్పడం కూడా ధరల పతనానికి దారి తీసింది. ఇదిలావుంటే మున్ముందు బ్యారెల్ ధర 20 డాలర్లకు రావచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.