బిజినెస్

టాటా సన్స్‌కు ఉన్నతోద్యోగులు గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 29: టాటా సన్స్‌లోని ముగ్గురు ఉన్నతోద్యోగులు రాజీనామా చేశారు. టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్ర్తి ఉద్వాసనకు గురైన కొద్దిరోజుల వ్యవధిలోనే మిస్ర్తి ఏర్పాటుచేసిన గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (జిఇసి) సభ్యుల్లో ముగ్గురు వైదొలగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టాటా సన్స్ చైర్మన్‌గా 2012లో మిస్ర్తి బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలల్లోనే జిఇసిని ఏర్పాటుచేశారు. తన లక్ష్యాల సాధనకు కావాల్సిన మద్దతు, వ్యూహాలను సమకూర్చడానికి ఈ జిఇసిని మిస్ర్తి ఏర్పాటుచేసుకున్నారు. జిఇసికి ముందు టాటా గ్రూప్ వ్యవహారాలను రతన్ టాటా ఏర్పాటుచేసిన జిసిసినే పర్యవేక్షించేది. 2000వ సంవత్సరంలో దీన్ని టాటా ఏర్పాటుచేశారు. ఇందులో టాటా గ్రూప్ సీనియర్లు ఎన్‌ఎ సూనవాలా, జెజె ఇరానీ, ఆర్‌కె కృష్ణకుమార్ సభ్యులు. మిస్ర్తి రాకతో జిసిసి స్థానంలో జిఇసి వచ్చింది.
అయితే మిస్ర్తి తొలగింపు నేపథ్యంలో ఆయన ఏర్పాటుచేసిన జిఇసిని కూడా టాటా సన్స్ రద్దు చేసింది. టాటా గ్రూప్ వెబ్‌సైట్ల నుంచి మిస్ర్తి వివరాలతోపాటు జిఇసి వివరాలను తొలగించింది కూడా. ఈ క్రమంలో జిఇసిలో సభ్యులుగా ఉన్న డాక్టర్ నిర్మల్య కుమార్, మధు కన్నన్, డాక్టర్ ఎన్‌ఎస్ రాజన్ తప్పుకున్నారు. ఈ విషయాన్ని టాటా అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. రాజీనామా చేసిన వారిలో ఎన్‌ఎస్ రాజన్ టాటా గ్రూప్ మానవ వనరుల విభాగం అధిపతిగా ఉండగా, లండన్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసరైన నిర్మల్య కుమార్ టాటా గ్రూప్ వ్యూహకర్తగా ఉన్నారు.
ఇక బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ) మాజీ చీఫ్ అయిన మధు కన్నన్ టాటా గ్రూప్ వ్యాపార అభివృద్ధి, ప్రజా సంబంధాల విభాగాలను చూస్తున్నారు. జిఇసి ఏర్పాటైన 2013లోనే వీరంతా సభ్యులుగా నియమితులయ్యారు. దీంతో మిస్ర్తి అనుయాయులుగా టాటా గ్రూప్‌లో ముద్రపడగా, మిస్ర్తి ఉద్వాసన నేపథ్యంలో ఈ ముగ్గురూ రాజీనామాలు సమర్పించడం ఇప్పుడు చర్చనియాంశమైంది. మరోవైపు జిఇసి ఐదుగురు సభ్యుల్లో మిగిలిన ఇద్దరైన డాక్టర్ ముకుంద్ రాజన్, హరీశ్ భట్‌లకు టాటా గ్రూప్‌లోనే త్వరలో కొత్త బాధ్యతలు అప్పగించనున్నారనే ఉహాగానాలున్నాయి.
100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన 100కుపైగా సంస్థల సమాహారమైన టాటా గ్రూప్ చైర్మన్‌గా మిస్ర్తిని సోమవారం టాటా సన్స్ ఆశ్చర్యకరంగా తొలగించినది తెలిసిందే. నాలుగు నెలల్లో కొత్త సారథిని ఏర్పాటు చేస్తామని చెప్పిన టాటా సన్స్.. ఇందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అందాక మాజీ చైర్మన్ రతన్ టాటాను తాత్కాలిక చైర్మన్‌గా నియమించింది. మిస్ర్తి తొలగింపునకు కారణాలను టాటా సన్స్ వెల్లడించలేదు. అయితే తనను అన్యాయంగా తొలగించారని మిస్ర్తి అంటుండగా, రతన్ టాటాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టాటా కూడా దీనిపై ధీటుగా స్పందిస్తుండగా, వీరిరువురి మధ్య ఇప్పుడు మాటల యుద్ధం కొనసాగుతోంది.