బిజినెస్

వైదొలగే ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 3: టాటా సన్స్ సంస్థ చైర్మన్ పదవి నుంచి అనూహ్య రీతిలో ఉద్వాసనకు గురైన సైరస్ మిస్ర్తి ఇప్పుడు ఆ గ్రూపులోని మిగిలిన అన్ని సంస్థలకు చైర్మన్‌గా కొనసాగాలని యోచిస్తున్నారు. ఈ సంస్థల చైర్మన్ పదవి నుంచి వైదొలగాలని మిస్ర్తి భావించడం లేదని ఆయన సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. ‘చట్ట ప్రకారం టాటా గ్రూపులోని మిగిలిన అన్ని సంస్థల చైర్మన్‌గా సైరస్ మిస్ర్తి విధులు నిర్వర్తిస్తారు’ అని ఆయన సన్నిహితుడు ఒకరు తెలిపారు. టాటా గ్రూపులో టాటా సన్స్ ప్రధాన హోల్డింగ్ సంస్థగా ఉన్న విషయం తెలిసిందే. టాటా సన్స్ సంస్థ చైర్మన్ పదవి నుంచి గత నెల 24వ తేదీన సైరస్ మిస్ర్తిని తొలగించినందున తమ గ్రూపులోని మిగిలిన సంస్థల్లోని పదవుల నుంచి కూడా ఆయన తనంతట తానే వైదొలుగుతారని టాటా గ్రూపు భావిస్తోంది. టాటా సన్స్ సంస్థ చైర్మన్ పదవి నుంచి మిస్ర్తి ఉద్వాసనకు గురైనప్పటికీ టాటా గ్రూపులోని టాటా స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సిఎల్), టాటా పవర్ కంపెనీ, టాటా గ్లోబల్ బేవరేజస్, టాటా కెమికల్స్, టాటా ఇండస్ట్రీస్, టాటా టెలీ సర్వీసెస్ తదితర సంస్థలకు ప్రస్తుతం ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. త్రైమాసిక ఫలితాలను ఆమోదించేందుకు శుక్రవారం జరుగనున్న ఐహెచ్‌సిఎల్ బోర్డు సమావేశంతో పాటు ఈ నెల 10వ తేదీన జరిగే టాటా కెమికల్స్ సంస్థ బోర్డు సమావేశానికి సైరస్ మిస్ర్తి అధ్యక్షత వహించాల్సి ఉంది.

చిత్రం.. సైరస్ మిస్ర్తి