బిజినెస్

పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 3: యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలిగే (బ్రెగ్జిట్) ప్రక్రియను వచ్చే ఏడాది ఆరంభం నుంచి మొదలు పెట్టాలన్న ప్రధాన మంత్రి థెరిస్సా మే ఆలోచనలనలకు బ్రిటన్ న్యాయస్థానంలో చుక్కెదురైంది. బ్రెగ్జిట్ ప్రక్రియను ప్రారంభించేందుకు తొలుత పార్లమెంట్ నుంచి తప్పనిసరిగా ఆమోదాన్ని పొంది తీరాలని లండన్‌లోని హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు దేశంలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఆర్టికల్ 50ని ప్రయోగించి కనీసం వచ్చే మార్చి నాటికైనా బ్రెగ్జిట్ ప్రక్రియను ప్రారంభించాలని యోచిస్తున్న థెరిస్సాను ఈ తీర్పు తీవ్రమైన చిక్కుల్లో పడేయనుంది. బ్రెగ్జిట్‌పై ఈ ఏడాది జూన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) నిర్వహించినప్పుడు చాలా మంది పార్లమెంట్ సభ్యులు దానిని వ్యతిరేకించారు. దీంతో తొలుత పార్లమెంట్ ఆమోదాన్ని పొందకుండానే బ్రెగ్జిట్ ప్రక్రియను ప్రారంభించే హక్కు థెరిస్సాకు ఉందని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. అయినప్పటికీ ఈ ప్రక్రియను ప్రారంభించాలంటే పార్లమెంట్ నుంచి తప్పనిసరిగా ఆమోదాన్ని పొంది తీరాలని లండన్ హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఈ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలా? లేదా? అనే విషయమై థెరిస్సా మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకవేళ ఆమె ఈ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే బ్రెగ్జిట్ ప్రక్రియ ప్రారంభం కావడం మరో ఏడాది వరకు జాప్యం కావచ్చు.