బిజినెస్

హిల్లరీ గెలుస్తుందనే ఆశలతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. సోమవారం లాభాల్లో ముగిశాయి. హిల్లరీ క్లింటన్‌కు ఎఫ్‌బిఐ నుంచి క్లీన్‌చిట్ రావడం మార్కెట్లను ఉత్సాహపరిచింది. ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ ముందంజలోకి రావడానికి హిల్లరీ వ్యక్తిగత ఈ-మెయిల్ సర్వర్ వ్యవహారంపై ఎఫ్‌బిఐ విచారణ కూడా ఓ కారణమే. అయితే ఎన్నికలకు ముందు ఈ వ్యవహారంలో ఎఫ్‌బిఐ నుంచి హిల్లరీకి ఉపశమనం లభించడంతో ఎన్నికల్లో ఆమే విజయం సాధిస్తారన్న నమ్మకం మదుపరులలో వ్యక్తమైంది. దీనికి నిదర్శనమే భారత్‌సహా ప్రపంచంలోని ప్రధాన దేశాల స్టాక్ మార్కెట్ల లాభాలు. ఇక బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 184.84 పాయింట్లు పుంజుకుని 27,458.99 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 63.30 పాయింట్లు అందుకుని 8,497.05 వద్ద నిలిచింది. మెటల్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, రియల్టీ, ఎఫ్‌ఎమ్‌సిజి, ఫైనాన్స్, చమురు, గ్యాస్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, టెలికామ్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా, హాంకాంగ్, ఐరోపా మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు లాభపడ్డాయి.
త్వరగా నిర్ణయం తీసుకోండి
న్యూఢిల్లీ: మరోవైపు టాటా-మిస్ర్తిల వ్యవహారంపై విదేశీ మదుపరులు స్పందించారు. ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా తేల్చుకోవాలని సూచించారు. లేనిపక్షంలో స్టాక్ మార్కెట్లలోని టాటా గ్రూప్ సంస్థల షేర్ల విలువ మరింత పతనం కాగలదన్న ఆందోళనను వ్యక్తం చేశారు. టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్ర్తిని తొలగించినది తెలిసిందే. తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటాను నియమించగా, నాలుగు నెలల్లో కొత్త సారథిని ఎంపిక చేసేందుకు ఓ కమిటీ కూడా ఏర్పాటైంది.