బిజినెస్

అరుణ్ జైట్లీతో రతన్ టాటా సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: టాటా సన్స్ సంక్షోభం నేపథ్యంలో దాని తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా మంగళవారం ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టాటా గ్రూప్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి రతన్ టాటా ఓ లేఖను రాయగా, జైట్లీతో తాజా సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో ఏం మాట్లాడారన్న దానిపై స్పందించేందుకు రతన్ టాటా నిరాకరించారు. గత నెల టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్ర్తికి టాటాలు ఉద్వాసన పలికినది తెలిసిందే. ఈ క్రమంలో టాటా గ్రూప్‌లోని ఒక్కో సంస్థ చైర్మన్ పదవి నుంచి మిస్ర్తిని తొలగిస్తుండగా, ఇప్పుడు టాటా గ్లోబల్ బేవరేజెస్ లిమిటెడ్ (టిబిజిఎల్) చైర్మన్ పదవి నుంచి మిస్ర్తిని తొలగించారు. మరోవైపు మిస్ర్తి దీన్ని అక్రమంగా అభివర్ణించారు. అయితే టాటా గ్లోబల్ బేవరేజెస్ లిమిటెడ్ చైర్మన్‌గా వైదొలిగిన ప్పటికీ, డైరెక్టర్‌గా మిస్ర్తి కొనసాగుతారు.

చిత్రం.. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమై బయటకు వస్తున్న రతన్ టాటా