బిజినెస్

టిసిఎస్ సమావేశానికి మిస్ర్తి దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 17: టాటా సన్స్ చైర్మన్ పదవినుంచి తొలగించిన సైరస్ మిస్ర్తి గురువారం జరిగిన ఆ గ్రూపుకే మకుటాయమానమైన టిసిఎస్ బోర్డు సమావేశానికి గైరుహాజరయ్యారు. కాగా, టిసిఎస్ బోర్డునుంచి మిస్ర్తిని తొలగించడంపై నిర్ణయం తీసుకోవడం కోసం వచ్చేనెల అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ఈ రోజు జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టిసిఎస్‌లో 73.26 శాతం వాటా కలిగి ఉన్న కారణంగా తనకున్న అధికారాలతో గత వారం టిసిఎస్ చైర్మన్ పదవినుంచి మిస్ర్తిని చైర్మన్ పదవినుంచి తొలగించిన టాటా సన్స్ ఆయనను బోర్డులో సభ్యుడిగా కూడా తొలగించే అంశాన్ని పరిశీలించడం కోసం అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని టిసిఎస్‌ను కోరింది. కాగా, గురువారం జరిగిన సమావేశానికి మిస్ర్తి రాకపోవడంతో తాత్కాలిక చైర్మన్‌గా నియమించిన ఇషాత్ హుస్సేన్ బోర్డు సమావేశానికి అధ్యక్షతవహించారని, డిసెంబర్ 13న అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించిందని సెబీకి దాఖలు చేసిన ఒక నివేదికలో టిసిఎస్ తెలియజేసింది. ఈ రోజు సమావేశానికే కాకుండా మిస్ర్తి తనను చైర్మన్ పదవినుంచి తొలగించిన తర్వాత తొలిసారిగా జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశానికి సైతం హాజరు కాలేదు. టాటా సన్స్ చైర్మన్‌గా తొలగించిన తర్వాత కూడా మిస్ర్తి టాటా మోటార్స్, టాటా పవర్, టాటా స్టీల్, టాటా కెమికల్స్ సహా ఆ గ్రూపునకు చెందిన పలు సంస్థలకు చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

చిత్రం.. బోర్డు సమావేశానికి వస్తున్న టిసిఎస్ తాత్కాలిక చైర్మన్ ఇషాత్ హుస్సేన్