బిజినెస్

ఆగని నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా నష్టాల్లో ముగిశాయి. పెద్దనోట్ల రద్దు కారణంగా ఆర్థికంగా ఎదురుకానున్న ప్రభావాలపై భయాలు ఇంకా తొలగిపోకపోవడంతో పాటుగా అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయాలు సైతం మార్కెట్లు నష్టాల్లో కొనసాగడానికి కారణమైనాయి. ఫలితంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ వరసగా నాలుగో రోజు కూడా దాదాపు 71 పాయింట్లు కోల్పోయి దాదాపు ఆరునెలల కనిష్టస్థాయి అయిన 26,228 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 8100 పాయింట్ల దిగువకు పడిపోయింది. భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లనుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండడం, డాలరు 13 ఏళ్ల గరిష్ఠస్థాయికి పెరగడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. నల్లధనాన్ని వెలికి తీయడం కోసం ప్రభుత్వం వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసున్న నిర్ణయం కారణంగా నగదుకు కొరత ఏర్పడి చాలావరకు నగదు లావాదేవీలపైనే సాగే చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలపై అది తీవ్ర ప్రభావం చూపించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మార్కెట్లు గత నాలుగు రోజులుగా నష్టాల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్నటికన్నా కాస్త పైస్థాయిలో 26,304.90 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెనె్సక్స్ బేరసారాల కొనుగోళ్ల కారణంగా ఒక దశలో 26,449.87 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరింది. అయితే ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో ధోరణులకు అనుగుణంగా నష్టాల్లోకి జారుకోవడం ప్రారంభమై ఒక దశలో 26,155.40 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. చివరికి 71.07 పాయింట్ల నష్టంతో 26,227.62 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 8,151.25-8,060.30 పాయింట్ల మధ్య ఊగిసలాడుతూ చివరికి 31.65 పాయింట్ల నష్టంతో 8,079.95 పాయింట్ల వద్ద ముగిసింది. 2016 మే 26 తర్వాత నిఫ్టీ ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి.
ఎఫ్‌పిఐ పాన్ వెరిఫికేషన్
ప్రక్రియను సులభం చేసిన సెబి
ఇదిలా ఉండగా విదేశీ పోర్ట్ఫులియో ఇనె్వస్టర్ల(ఎఫ్‌పిఐ) ఖాతాలు తెరిచే సమయంలో పాన్ వెరిపికేషన్ ప్రక్రియను సెబి సులభతరం చేసింది. మధ్యవర్తులు ఆదాయం పన్ను శాఖ అధీకృత వెబ్‌సైట్‌ద్వారా ఆన్‌లైన్‌లో ఎఫ్‌పిఐల పాన్‌ను వెరిఫై చేసువచ్చని సెబి తెలిపింది. అయితే ఖాతాలు తెరిచిన 60 రోజుల లోపల లేదా దేశం వెలువపలనుంచి నిధులు చెల్లించే ముందు ఏది ముందయితే అప్పుడు ఎఫ్‌పిఐలు తమ మధ్యవర్తులకు తమ పాన్‌కార్డు కాపీని అందజేయాల్సి ఉంటుందని సెబి తెలియజేసింది.