బిజినెస్

వృద్ధి రేటు లక్ష్యం 10 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: రాబోయే మూడు దశాబ్దాల్లో నిలకడగా 9నుంచి 10 శాతం వృద్ధి రేటును సాధించడంపై దృష్టి పెడుతూ భారత దేశం వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) చట్టం చేయడం, పెద్ద నోట్ల రద్దుసహా పలు చర్యలు తీసుకుందని నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ చెప్పారు. ‘దివాలా చట్టం మొదలుకొని వస్తు సేవల పన్ను(జిఎస్‌టి), పెద్ద నోట్ల రద్దు దాకా భారత్‌లో మేము వ్యవస్థాగత సంస్కరణలను చేపడుతున్నాం’ అని ఆయన చెప్పారు. ఈ ప్రధానమైన వ్యవస్థాగత సంస్కరణలు రాబోయే సంవత్సరాల్లో దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపించనున్నాయని కాంత్ అంటూ, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం దేశం ఇప్పుడు స్వల్పకాలిక నొప్పులు అనుభవిస్తోందని చెప్పారు. ‘మరో మూడు దశాబ్దాల పాటు 9-10 శాతం వృద్ధి రేటును, అది కూడా నిలకడగా సాధించాలనేది మా లక్ష్యం. అందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది’ అని గురువారం ఇక్కడ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ర్యూవెన్ రివ్లిన్ సమక్షంలో మాట్లాడుతూ అమితాబ్ కాంత్ చెప్పారు.
భారత దేశం తన రక్షణ ఉత్పాదక రంగానికి ఊపునివ్వాలని అనుకుంటోందని, అందువల్ల దేశానికి ఇజ్రాయెల్‌తో సంబంధాలు తమకు ఎంతో ముఖ్యమని కూడా ఆయన అన్నారు. రక్షణ పరికరాలను భారీ ఎత్తున దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటని, అందువల్ల వీటిని భారత్‌లోనే తయారు చేసుకోవలసిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. ఇజ్రాయెల్‌తో రక్షణ సహకారాన్ని తాము క్రమంగా పెంచుకున్నామని, ఇప్పుడు భారత్‌కు రక్షణ పరికరాలను సరఫరా చేసే దేశాల్లో ఇజ్రాయెల్ మూడోస్థానంలో ఉందని చెప్పారు.వాణిజ్య సంఘాలు ఫిక్కీ, సిఐఐ, అసోచామ్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘్భరత్-ఇజ్రాయెల్ ఆర్థిక వేదిక’ సదస్సులో అమితాబ్ కాంత్ మాట్లాడారు.

చిత్రం.. నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్