బిజినెస్

ఏడేళ్ల జైలు తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: మరొకరి ఖాతాలో తమ అక్రమ సొమ్మును డిపాజిట్ చేస్తే ఏడేళ్లు జైలుశిక్ష తప్పదని ఆదాయ పన్ను శాఖ హెచ్చరించింది. కొత్తగా తెచ్చిన బినామీ లావాదేవీల చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఐటి శాఖ స్పష్టం చేసింది. ఇతరుల ఖాతాల్లో జమచేసి నల్లధనాన్ని సక్రమంగా మార్చుకోవాలనుకుంటే జరిమానాలు, విచారణలు, కారాగారం ఎదుర్కోవాల్సిందేనంది. 80కిపైగా చేసిన సర్వేలు, దాదాపు 30 సోదాల్లో 200 కోట్ల రూపాయలకుపైగా అప్రకటిత ఆదాయాన్ని గుర్తించినట్లు ఐటి శాఖ చెబుతోంది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు 500, 1,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ రాత్రి రద్దు చేసినది తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసి వాటి స్థానంలో కొత్తగా తెచ్చిన నోట్లను మార్చుకోవాలని ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. డిసెంబర్ 30 వరకు నోట్ల మార్పిడికి అవకాశమిచ్చారు. అయితే రోజుకు 50,000 రూపాయలకు మించి జమ చేసినా, ఖాతాలో రెండున్నర లక్షలకుపైబడి డిపాజిట్ అయినా ఆ నగదుకు సంబంధించిన వివరాలను ఐటి శాఖకు తెలియపరచాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ డిపాజిట్ల వివరాలను అందించాలని బ్యాంకులు, పోస్ట్ఫాసులనూ ఐటి శాఖ కోరింది. కానీ అక్రమార్కులు తమ అవినీతి సంపదను మార్చుకునే దారులను అనే్వషిస్తూ ఇతరుల ఖాతాల్లో జమ చేయడం, ముఖ్యంగా పేదల జన్ ధన్ ఖాతాల్లోకి తెస్తున్నట్లు సమాచారముండటంతో ఐటి శాఖ ఆ కోణంలో దృష్టి సారించాలని సిబిడిటి సూచించింది. ఈ క్రమంలోనే అట్టి చర్యలకు పాల్పడితే గరిష్ఠంగా ఏడేళ్ల జైలుశిక్ష తప్పదని హెచ్చరించింది. ఖాతాదారులనూ శిక్షిస్తామంది.