బిజినెస్

ఓలా ‘క్యాష్‌లెస్ రైడ్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ యాప్ ఓలా.. ఓ సరికొత్త ప్రచారానికి తెరతీస్తోంది. అదే ‘క్యాష్‌లెస్ రైడ్స్’. అవును.. 500, 1,000 రూపాయల నోట్ల రద్దు క్రమంలో తలెత్తిన చిల్లర సమస్య దృష్ట్యా ప్రయాణికులు నగదురహిత చెల్లింపు అవకాశాలను వినియోగించుకోవాలని సూచిస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఈ-కామర్స్, రిటైల్ బ్రాండ్స్, ఓలా మనీ, ఓలా ఈ-వాలెట్ భాగస్వామ్యంతో క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా బిల్లులు చెల్లించవచ్చని ఓ ప్రకటనలో ఓలా తెలిపింది. దీనికి సంబంధించి టెలివిజన్, పత్రికా ప్రకటనలు ఇవ్వనున్నట్లూ స్పష్టం చేసింది.