బిజినెస్

నవ్యాంధ్రలో పారిశ్రామిక పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 21: నవ్యాంధ్రలో ఒక ఉద్యమంలా పరిశ్రమల స్థాపనకు భారీ పారిశ్రామిక సంస్థలు ముందుకొస్తున్నాయి. అన్నిరకాల పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఫార్మాస్యూటికల్స్, హోటల్, పెయింట్స్, ఆగ్రో-ప్రాసెసింగ్, సిమెంట్, విద్యుత్, వస్త్రాలు- దుస్తులు, ఫెర్టిలైజర్స్, సిమెంట్, ఎలక్ట్రానిక్స్, బేవరేజెస్, గ్రానైట్, సిరామిక్, ఎలక్ట్రికల్, ఐటి, ఆటోమొబైల్, పెట్రోకెమికల్స్, ఇంధనం, మినరల్ ఆధారిత పరిశ్రమ, తోళ్ల పరిశ్రమ, ఇంజనీరింగ్, గ్లాస్, బొగ్గు, పర్యాటకం, పేపర్, ప్లాస్టిక్, మెరైన్ వంటి రంగాల్లో ప్రాజెక్టుల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉద్యోగావకాశాలు పెరగాలనే ధ్యేయంతో ప్రభుత్వం అనేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు ప్రకటించింది. అందులో భాగంగా భూకేటాయింపులు, పన్నుల రాయితీలు కల్పిస్తోంది. అనుకూల, సులభతరమైన పారిశ్రామిక విధానాలను అవలంభిస్తుండటం వల్ల పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలంటే అక్కడ తయారయ్యే ఉత్పత్తి, వాడే ముడిపదార్థం, ప్రమాదకర వ్యర్థాల తీవ్రత, తదితర అంశాల ఆధారంగా 20 నుంచి 30 రకాల అనుమతులు పొందవలసి ఉంటుంది. పరిశ్రమల శాఖ మొదలుకొని కాలుష్య నియంత్రణ, విద్యుత్, పౌర సరఫరాలు, అటవీ, భూగర్భ జలాలు, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, వాణిజ్య పన్నులు, రెవెన్యూ, జలవనరులు, కార్మిక, బాయిలర్, సిఎటి, సిఎస్టీ, తదితర శాఖల అనుమతులు పొందాలి. కొన్ని శాఖల్లో మూడు, నాలుగు రకాల అనుమతులు కూడా పొందాల్సి ఉంటుంది. ఈ అనుమతులన్నీ పొందడానికి గతంలో సుదీర్ఘకాలం పట్టేది. ఇప్పుడు ఆ జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం సింగిల్ డెస్క్ విధానం ప్రవేశపెట్టింది. కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. ఈ విధానం ద్వారా కావలసిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 14 రోజుల్లోనే అనుమతి ఇస్తున్నారు. ఈ డెస్క్ ప్రారంభమైన 2015 ఏప్రిల్ 29 నుంచి ఇప్పటివరకు చిన్న, పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు 13,347 దరఖాస్తులు రాగా 12,354కి అనుమతులు మంజూరు చేశారు. మరో 225 దరఖాస్తులు సర్వీస్ లెవల్ ఎగ్రిమెంట్ (ఎస్‌ఎల్‌ఎ) పరిధిలో పెండింగ్‌లో ఉన్నాయి. గత మూడు నెలల కాలంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే సెప్టెంబర్‌లో 884 దరఖాస్తులు రాగా, 840కి అనుమతులు మంజూరు చేశారు. అక్టోబర్‌లో 783 రాగా, 729ని అనుమతించారు. ఈ నెలలో 21వ తేదీ వరకు 574 రాగా, 349కి అనుమతులు మంజూరు చేశారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి. వివిధ రంగాలను పరిశీలిస్తే ఫార్మా కంపెనీలు తమ యూనిట్లను స్థాపించడానికి ఎక్కువగా ముందుకొచ్చాయి. ఇప్పటికే ఉన్న కంపెనీలతోపాటు కొత్త కంపెనీలు కూడా తమ యూనిట్లను రాష్ట్రంలో నెలకొల్పనున్నాయి. తరువాత ఫుడ్, ఆగ్రో, టెక్స్‌టైల్స్ పరిశ్రమల స్థాపనకు ఎక్కువగా అనుమతులు పొందారు. పవర్ సెక్టార్, సిమెంట్ పరిశ్రమల్లో భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. పలు పరిశ్రమలు విద్యుదుత్పత్తి యూనిట్లు స్థాపించనున్నాయి. సోలార్ పవర్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి కూడా పలువురు ముందుకొచ్చారు. అల్ట్రాటెక్, చెట్టినాడు, రామ్‌కో వంటి సిమెంట్ ఫ్యాక్టరీలు నెలకొల్పనున్నారు. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్ పవర్ జెనరేషన్ కార్పొరేషన్‌లు రెండు భారీ ప్రాజెక్టులు చేపట్టనున్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్), ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జిసి), కోల్గేట్ పామోలివ్, ఏషియన్ పెయింట్స్, లూయిస్ డ్రేఫస్ కమోడిటీస్ లిమిటెడ్, జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఇసుజు మోటార్స్, దయానిధి సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, సిటీమోటార్స్, ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు తమ ప్రాజెక్టులను ప్రారంభించనున్నాయి. ఇప్పటికే అనుమతించిన ప్రాజెక్టులను ప్రారంభిస్తే రాష్ట్రంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతాయి. యువతకు ఉపాధికి ఢోకా ఉండదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి కూడా పెరిగి ఆర్థిక వృద్ధి ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది.