బిజినెస్

సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దూసుకుపోతున్న భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ప్రపంచంలో సాంకేతిక సన్నద్ధత, మానవ-సాంకేతిక అనుసంధానం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో భారత్‌కు చెందిన సంస్థలు ముందంజలో ఉన్నాయని ఓ సర్వే స్పష్టం చేసింది. అభివృద్ధి చెందిన దేశాలైన సింగపూర్, ఆస్ట్రేలియాలను కాదని భారత్ ఈ విషయంలో దూసుకుపోతోందని, దేశంలోని 38 శాతం సంస్థలు ఇప్పటికే ఈ విధానాలను అమలు చేశాయని ఆ సర్వేలో తేలింది. ప్రఖ్యాత ‘డెల్ టెక్నాలజీస్’ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఈ విషయంలో ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలోని వ్యాపార, వాణిజ్యరంగాలు ఎంతో పరిణతి సాధించాయని తేటతెల్లం కావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని సర్వే ఫలితాలను వివరించిన ‘డెల్ ఈఎమ్‌సీ’ మేనేజింగ్ డైరక్టర్, అధ్యక్షుడు రాజేష్ జనే అన్నారు. ఆయన చెప్పిన సర్వే ఫలితాలు ఆసక్తి రేపాయి.
భారత్ మాదిరిగా మానవ వనరులు, యంత్రాలు కలసికట్టుగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధంగా వినియోగించుకోవడానికి కనీసం రెండేళ్లయినా పడుతుందని ఆస్ట్రేలియా, సింగపూర్, న్యూజిలాండ్ భావిస్తున్నాయి. తమకు రెండు నుంచి ఐదేళ్ల సమయం పడుతుందని చైనా భావిస్తూంటే జపాన్ ఈ విషయంలో ఇంకా ఒక నిర్దిష్ట అంచనాకు రాలేదు.
ప్రపంచంలోని 17 దేశాల్లోని 12 రంగాలలోని 3800 మంది ప్రపంచస్థాయి వాణిజ్య దిగ్గజ సంస్థల సారధులతో జరిపిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. వీరిలో భారతదేశానికి చెందిన 300 మంది భారత వాణిజ్యరంగానికి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. 2030 నాటికి సమాజంపై సాంకేతిక విజ్ఞానం ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న అంశంపై సర్వే నిర్వహించారు. 250మందికి పైగా ఉద్యోగులున్న సంస్థలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి చెందిన 40 శాతం మంది సారధులు, వాణిజ్యవర్గానికి చెందిన 60 శాతం మంది వివిధ శాఖల అధిపతుల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా సేకరించారు. డిజిటల్ బిజినెస్ అమలుకు ప్రధానంగా నిధులు, వనరుల కొరత ప్రధాన అడ్డంకిగా ఉందని దాదాపు అన్ని దేశాలు అభిప్రాయపడితే చైనా మాత్రం తమకు అనుభవజ్ఞులైన నిపుణులు, నాయకత్వ సమస్య అడ్డంకిగా ఉందని చెప్పింది. అయితే భారత్ మాత్రం ఈ దిశగా ఇప్పటికే దూసుకుపోతోందని, అయితే డేటా భద్రత, గోప్యత విషయంలో సమస్యలున్నాయని సర్వేలో పాల్గొన్న భారతీయ ప్రతినిధుల్లో 47 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే మానవ-యంత్రాల అనుసంధానత ద్వారా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో ఎదురయ్యే సమస్యలు, దాని ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై చైనాకు చెందిన మెజారిటీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడితే సైబర్ దాడులు జరిగినప్పుడు భారీ నష్టమే జరుగుతుందని చైనా అభిప్రాయపడింది. కాగా ఈ విషయంలో స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని ఆస్ట్రేలియా, జనాప్, న్యూజీలాండ్ స్పష్టం చేస్తే మంచీచెడులను కంప్యూటర్లు విశే్లషించగలిగేలా ఉండాలని సింగపూర్ అభిప్రాయపడింది. భారత్‌కు చెందిన ప్రతినిధుల్లో 57 శాతం మంది మానవ-యంత్ర అనుసంధానత విషయంలో స్పష్టమైన విధివిధానాల రూపకల్పన తప్పనిసరి అని పేర్కొన్నారు.