సెంటర్ స్పెషల్

అణువు పుట్టిల్లు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టికి పంచ మహాభూతాలతోపాటు స్థల, కాలం, మనసు, ఆత్మలు కూడా మూలమని కణాదుడు సూత్రీకరించాడు. (ఐన్‌స్టీన్ స్థల కాలాలతో విప్లవాత్మక సిద్ధాంతాలు ప్రతిపాదించాడు.) పదార్థ జగత్తులోని ప్రతిదీ పరమాణు నిర్మితమే. ఇవే కలిసిపోయి అణువులుగా ఏర్పడతాయి. జాన్ డాల్టన్ కంటే 2,500 సంవత్సరాల ముందు గణాదుడు ఈ సిద్ధాంతాన్ని నిర్మించాడు. ‘వైశేషిక - సూత్ర’గా ఇది శతాబ్దాలపాటు భారతీయ ఋషుల తాత్విక చింతనను ప్రభావితం చేసింది. పరమాణు పరిమాణాన్ని, కదలికలను, ఇవి ఒకదానితో మరొకటి జరిపే రసాయనిక చర్యలను సైతం కణాదుడు వివరించాడు.
భూమి, నీరు, కాంతి లేదా అగ్ని, వాయువు, ఆకాశం అనే అయిదు పంచ మహాభూతాలు ఒక్కో రకమైన పరమాణు నిర్మితాలు. అది చెంది ఉండే పదార్థాన్ని పరమాణువు స్వభావం మారుతూ ఉంటుంది. నీటిలో వస్తువు తేలికగా ఎందుకు అనిపిస్తుందో కణాదుడు ఊహించాడు. నీటి పరమాణువు గాలి పరమాణువు కంటే ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. నీటికి ఉండే ఈ అదనపు సాంద్రత వస్తువు భారాన్ని ఆ మేరకు అదనంగా మోస్తుంది. గాలిలోని పరమాణువుల సాంద్రత తక్కువ కాబట్టి వస్తువు భారాన్ని అది తక్కువగా మోస్తుంది. కాబట్టి, నీటిలో ఒక వస్తువును మనం పైకి లేపినప్పుడు, అది బరువు తగ్గినట్లు అనిపిస్తుంది. అదే వస్తువు బరువు గాలిలో ఎక్కువగా ఉంటుంది. ఎంతో ప్రాథమిక స్థాయిలో కణాదుడు చెప్పిన ఈ ముఖ్య అంశాన్ని ఆర్కిమెడిస్ సిద్ధాంతానికి మూలంగానే భావించాలి.
పరమాణువుపై కణాదుడి పరిశీలన ఇలా సాగింది. అంతర్లీనంగా వుండే కోరిక ఒక పరమాణువును మరొక దానితో కలుపుతుంది. ఒకే తరగతికి చెందిన రెండు పరమాణువులు కలిసినప్పుడు ‘ద్వైణుక’ ఏర్పడుతుంది. ఆది పరమాణువుల లక్షణాలే ఈ తరహా ‘ద్వైణుక’కు ఉంటాయి. ఒక తరగతి పరమాణువులు ఇతర తరగతుల పరమాణువులతో విభిన్న రీతులలో సమ్మేళనం చెందడం వల్ల రకరకాల ‘ద్వైణుక’లు ఆవిర్భవిస్తాయి. అంటే విభిన్నమైన పదార్థాలు ఏర్పడతాయి. విభిన్న పరమాణువుల కలయికల వల్ల రసాయనిక మార్పులు సంభవిస్తాయి. ఉష్ణ వ్యత్యాసాలు ఈ మార్పులకు దారి తీస్తాయని కణాదుడు అంటాడు. కాల్చినప్పుడు మట్టికుండ నల్లబడటం, మాగవేసిన కాయలు పండటం, ఉష్ణ పదార్థాలలో తెచ్చిన రసాయనిక మార్పుల ఫలితమేనని ఉదాహరణలు ఇచ్చాడు. ఇలా అన్ని వస్తువులు, విశ్వంలో ఉన్న పదార్థం యావత్తూ పరమాణు (ఆటమ్) నిర్మితమేనని కణాదుడు సూత్రీకరించాడు. పరమాణువు ప్రత్యేక గుణాలు, వాటి విభిన్న కలయికలు, ఉష్ణోగ్రతా వ్యత్యాస ప్రభావం ఈ మూడు కారణాలవల్లే ఒకే పదార్థం రకరకాలుగా రూపొందుతుంది.
అలెగ్జాండర్ దండయాత్ర అనంతరం భారత్‌కు, పశ్చిమ దేశాలకు నడుమ సంబంధాలు ఏర్పడ్డాయి. వాటి ఫలితంగా భారతీయుల అణు భౌతిక భావనలు పశ్చిమ దేశాలకు పాకి ఉంటాయి. క్రీ.పూ.330 ప్రాంతంలో గ్రీసులు వాయవ్య భారతం మీద దండెత్తారు. అలెగ్జాండర్ వెంట అతని గురువు అరిస్టాటిల్ సహా పలువురు గ్రీకు తత్వవేత్తలు వచ్చారు. తాము సందర్శించిన ప్రాంతాలలోని శాస్త్రాలను పండితులు అధ్యయనం చేయకుండా ఉండరు. అలెగ్జాండర్ మరణానంతరం సైతం భారత్, గ్రీసుల నడుమ వాణిజ్య, దౌత్య సంబంధాలు ముమ్మరంగా సాగాయి. కొంతమంది గ్రీకులు ఆసియాలో స్థిరపడ్డారు. ఇలా భారతీయుల ఆలోచనలు పశ్చిమ దేశాలకు పయనించి అవి అక్కడ ఇంకా అభివృద్ధి చెందాయన్నది ఒక సిద్ధాంతం.

-నాయక్