'క్లాప్' కొట్టు గురూ!

ఇకపై బిజీగానే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-వుంటానంటోంది అందాల భామ నయనతార. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర నటుల సరసన ఆడిపాడిన ఈ సుందరాంగి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. కెరీర్ పరంగా చూసుకుంటే నయనకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తేనే కాస్త పరేషాన్. పరిశ్రమలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అందరి అభిమానాలను పొందడమేగాక, నటిగా మంచి మార్కుల్నే కొట్టేసింది. తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసును దోచుకున్న ఈ భామ శింబు, తర్వాత ప్రభుదేవా అంటూ పీకలోతు ప్రేమలో కొట్టుకుపోయి బాక్సాఫీస్ వద్ద భారీగానే బోల్తాకొట్టింది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు వాటినన్నింటినీ మరచిపోయి కొత్త జీవితాన్ని పొందాలనుకుంటోందిట. ప్రేమా, పెళ్లిలాంటి విషయాలతో కెరీర్‌ని ఎంతగా కోల్పోయిందో నయనకు తెలిసొచ్చింది. అందుకే ‘ఇక అలా జరగనే జరగదు’ అని గట్టిగానే చెబుతోందిట. ప్రభుదేవాతో పెళ్లి పెళ్లి అంటూ తిరగడం వల్ల ఎన్నో మంచి అవకాశాలను వదులుకుంది. అతడిని నమ్మి చేసిన పొరపాటు ఆలస్యంగా తెలుసుకునేలోపే కెరీర్‌లో జరగాల్సినదంతా జరిగిపోయింది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను చేస్తూనే గ్లామర్ భామగా కూడా తన సత్తా ఏమిటో రుచిచూపించిన నయనను కెరీర్ ఎలా సాగుతోంది అని కదిలిస్తే- ‘‘ఇన్నాళ్లు కెరీర్‌లో ఏం కోల్పోయానో తెలుసుకున్నా. ఇక అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నా. కెరీర్‌లో ఆచి తూచి అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడిప్పుడే మళ్లీ మంచి అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే కెరీర్‌లో బిజీ బిజీగా మారబోతున్నాను. తెలుగు, తమిళ భాషల్లో మంచి ఆఫర్లు వున్నాయి’’ అంటూ చెప్పుకొచ్చింది.