'క్లాప్' కొట్టు గురూ!

ప్రేమకథలపై మోజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్ ప్రేమకథా చిత్రాల్లో నటించేందుకు బాగా ఆసక్తి కనబరుస్తోందిట. కథానాయికగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌గా గుర్తింపుని తెచ్చుకున్న ఈ అమ్మడికి అవకాశాలు వరుసగా దరిచేరుతున్నాయి. నిర్మాతలు రకుల్‌ని తమ చిత్రాల్లో బుక్ చేసుకునేందుకు బాగా ఆసక్తిచూపుతున్నారు. తెలుగు, తమిళ చిత్రాలతో బిజీ బిజీగా వున్న రకుల్ ప్రేమకథలను చాలా ఇష్టపడతానంటోంది. ఐదేళ్ల కెరీర్‌ళో కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ పాత్రలతో యువతను తన వైపునకు తిప్పుకున్న ఈ బ్యూటీకి ‘టైటానిక్’, ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’లాంటి హృద్యమైన ప్రేమకథా చిత్రాలంటే చాలా ఇష్టమట. అందుకే అలాంటి చిత్రాల్లో నటించే అవకాశం కోసం వేచి చూస్తున్నానంటోంది. ప్రస్తుతం ‘్ధృవ’, మహేష్‌బా..మురగదాస్ సినిమాతో పాటు నాగ చైతన్య కొత్త చిత్రం, బాలీవుడ్‌లో ‘సిమ్లా మిర్చీ’, తమిళంలో మరో రెండు సినిమాలు చేస్తూ క్షణం తీరికలేకుండా గడుపుతోంది రకుల్!!

-సమీర్