'క్లాప్' కొట్టు గురూ!

తెలివైందే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిక్కీ గల్రాని.. గత మూడేళ్ల కాలంలో దక్షిణాది భాషల్లో దాదాపు పాతిక చిత్రాలకు పైనే నటించింది. ‘డార్లింగ్’ అనే తొలి తమిళ చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ తాజాగా ఆదిపినిశెట్టి హీరోగా కెఆర్‌కె శరవణన్ దర్శకత్వంలో ‘మరకతమణి’లో నటించింది. ఇది విభిన్నమైన పాత్రే ఆమెకు. తమిళంలో చేసిన ‘డార్లింగ్’ చిత్రం ద్వారా అక్కడ ఇప్పుడందరూ ఆమెను డార్లింగ్ అనే పిలుస్తున్నారట. ఆమెకు ఆ చిత్రం తెచ్చిన ఇమేజ్ అంతా ఇంతాకాదు. దాంతో అక్కడ యమబిజీగా మారింది. తెలుగులో ‘కృష్ణాష్టమి’, ‘మలుపు’ చిత్రాల తర్వాత తెలుగులో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తమిళ చిత్రాల ద్వారా బిజీ కావడమేనంటోంది. దాదాపు తమిళంలో చేసిన చిత్రాలు నిక్కీకి ఎనలేని ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం తెలుగులోనూ బిజీగా మారబోతోంది. ఆమె చేతిలో ఇప్పుడు మంచి అవకాశాలున్నాయట. ఈ విషయం గురించి నిక్కీ చెబుతూ- ‘‘తెలుగు, తమిళ చిత్రాలే నా టార్గెట్. ఈ రెండు భాషల్లో మంచి చిత్రాలు చేసి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలనుకుంటున్నా’’అని చెప్పుకొచ్చింది. మొత్తం మీద నిక్కీ చాలా తెలివైందే!

-సమీర్