'క్లాప్' కొట్టు గురూ!

ఇంకా రూమర్సేనా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్ పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి రూమర్స్‌నే ఎదుర్కొంటుంది. అందాల భామలకు ఇలాంటి రూమర్స్ కథానాయికలకు మామూలే అయినా కత్రీనాకు మాత్రం మరీ ఎక్కువై పోయాయి. బాలీవుడ్‌లో ఎదుగుతున్న కథానాయికలకు, క్రేజీ భామలకు ఇలాంటివి తలనొప్పిగా తయారై వారి కెరీర్‌నే సందిగ్ధంలో పడేస్తున్నాయి. ఈ విషయం గురించి ఇటీవల కత్రీనాను మీడియా గుచ్చి గుచ్చి అడిగితే- ‘‘రూమర్స్ గోల నాకేల? తొలిదశ నుంచి నాపై ఇలాంటివి మామూలే అయిపోయాయి. నేను కూడా వాటిని అంతగా పట్టించుకోవడం లేదు. అందుకే నాపై రూమర్స్ బాగా పుట్టుకొస్తున్నాయి. ఎదుగుతున్న నటీమణుల విషయంలో ఇవి మామూలే అయినప్పటికీ, నాపై మరీ ఎక్కువ సృష్టించారు. ఒకటా, రెండా లెక్కనన్ని రూమర్స్ అంటగట్టారు. వాటిని పట్టించుకుంటే కెరీర్ ఇక అంతే! మనం చేస్తున్న చిత్రాలు, చేయాల్సిన పాత్రలు, కెరీర్‌ని మలుచుకునే తీరు ఇవన్నీ మన చేతిలోనే వుంటాయి. ఈ విషయంలో ఎవరైనా జాగ్రత్త పడకపోతే కెరీర్‌లో నిలదొక్కుకోవడం చాలా కష్టం. నాకు ఒకోసారి అనిపిస్తుంది. ఇంకా నాపై రూమర్స్ సృష్టించడమేనా? అనిపిస్తుంది’’అని చెప్పుకొచ్చింది కత్రీనాకైఫ్. అదీ..సంగతీ!!

-సమీర్