'క్లాప్' కొట్టు గురూ!

ఐటమ్‌సాంగ్స్ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చాలామంది గతంలో జాక్వెలిన్ ఐటమ్‌సాంగ్స్ చేసింది.. మళ్లీ చేస్తుందేమో అని అంటుంటారు. కానీ నేను గతంలో చేసినవి ఐటమ్‌సాంగ్స్ కాదు, స్పెషల్ సాంగ్స్ మాత్రమే. అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటే మరీ మంచిది’’ అంటోంది అందాల భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. తనకు చేయాలి అనిపిస్తే చాలు.. అది ఎలాంటి పాత్ర అయినా ఫర్వాలేదు. ఇట్టే ఒప్పేసుకుంటుందిట. గతంలో రెండు సినిమాల్లో ఇలా చేసింది. వాటికి మంచి పేరు వచ్చింది. అలాంటి పేరు మళ్లీ వస్తుందనుకుంటే చేయడానికి రెడీనే అంటుంది తప్ప పూర్తిగా వాటికే పరిమితం అంటే ఏ మాత్రం ఒప్పుకోదట. ఈ విషయం గురించి జాక్వెలిన్‌ను కదిలిస్తే- ‘‘స్పెషల్ సాంగ్స్‌కి ఒక ప్రత్యేకత వుంటుంది. వీటికి పారితోషికాలు కూడా భారీగానే వుంటాయి. ఈ విషయంలో అందరిలా నేను తీసుకుంటాను. ఇతరుల కంటే ఎక్కువ మొత్తంలో నేనేమీ డిమాండ్ చేయను. అలా అని నాకు ఎక్కువ ఇవ్వడానికి ఎవరూ ముందుకురారు. ఇలాంటి వాటికి ఎంత ఇవ్వాలి అనేది దర్శక, నిర్మాతల నిర్ణయం. సినిమాకు ఇంత అని డిమాండ్ చేయొచ్చు కానీ, పాటలకి ఎలా డిమాండ్ చేస్తాం చెప్పండి’’అంటూ చెప్పుకొచ్చింది. అందచందాలు, మేని ఒంపుసొంపులు జాక్వెలిన్‌ని చూడగానే ఇట్టే గుర్తుకు వస్తాయి. విదేశీభామలు బాలీవుడ్‌లో రాజ్యమేలడం కొత్తేమీకాదు. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తమ ప్రతిభను చాటుకున్నారు. అలా చాటుకున్న వారిలో జాక్వెలిన్‌ని ముందుగా చెప్పుకోవాలి. రానున్న రోజుల్లో అన్ని భాషల్లో సినిమాలు చేయాలన్నదే తన జాక్వెలిన్ ఆశయమట! గుడ్‌లక్ జాక్వెలిన్!

-సమీర్