'క్లాప్' కొట్టు గురూ!

క్రేజీ గర్ల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు టాలీవుడ్‌లో ఎవ్వరినోట విన్నా యువతరం క్రేజీ తార హెబ్బాపటేల్ గురించే. అందం, అభినయంతో పాటు చలాకీతనం మెండుగావున్న ఈ బ్యూటీ తెలుగు చిత్రసీమలోకి వచ్చిన కేవలం మూడేళ్ల కాలంలోనే ఎనిమిది చిత్రాల్లో నటించి తన నటనతో అందర్నీ విశేషంగా అలరించింది. ఆయా చిత్రాల్లో పోషించిన పాత్రల ద్వారా ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్‌ని సంపాదించుకుంది. తాజాగా తన చిత్రాల్లోని పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకునే ప్రయత్నాలు కూడా చేస్తోంది. అతి తక్కువ కాలంలో కెరీర్‌లో రివ్వున దూసుకెళుతున్న హెబ్బాపటేల్‌ని కెరీర్ ఎలా అనిపిస్తుంది? అని కదిలిస్తే- ‘‘చాలా హ్యాపీగా వుంది. ఇంత త్వరగా ఇంత చక్కటి ఆదరణ లభిస్తుందని ఊహించలేదు. తెలుగు ప్రేక్షకులు మంచి మనసున్న వారు. అందుకే నాపై చూపిస్తున్న ఆదరణ, చిత్రసీమ నాకు కలిపిస్తున్న అవకాశాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక వేళ నేను హీరోయిన్ కాకపోయినా ప్రేక్షకులను మరో కోణంలో అలరించేదాన్ని. అదే కామెడీ యాంగిల్. తొలిసారిగా చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పుడు నేను హీరోయిన్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోతే కామెడీ టచ్‌తో అలరించాలని అనుకున్నా. కానీ ఇప్పుడు చాలా మంది నన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చక్కగా నటిస్తున్నానని, మంచి పాత్రలు పోషిస్తున్నానని చెబుతున్నారు. వాళ్ల అభిమానంతోనే నేను కెరీర్‌లో ఇంకా ముందుకెళ్లగలుగుతున్నాను’’ అంటూ ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చింది. దటీజ్..హెబ్బా!!

-సమీర్