'క్లాప్' కొట్టు గురూ!

బికినీ బ్యూటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో శర్వానంద్ హీరోగా నటించిన ‘రన్ రాజా రన్’ గుర్తుంది కదా? అందులో అతడి సరసన ఆడిపాడిన బికినీ బ్యూటీ సీరత్‌కపూర్ తాజాగా ‘రాజుగారి గది’ సీక్వెల్ చిత్రంలో అవకాశాన్ని చేజిక్కించుకుంది. అయితే ఇటీవల తన బికినీ ఫొటోలతో సోషల్ మీడియాలో తెగ సందడి చేసేసింది. ఈ ఫొటోలు చాలా వైరల్ అయ్యాయి. అంతే కాదు, ఒక వీరాభిమాని సీరత్‌కపూర్ పేరుని తన చేతి మీద చెక్కేసుకున్నాడు. అదీ.. రక్తం వచ్చేట్టు పేరు చెక్కేసుకోవడం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ అమ్మడికి మైండ్ బ్లాంక్ అయిపోయిందిట. దీని గురించి సీరత్‌కపూర్‌ని ప్రశ్నిస్తే- ‘‘అభిమానం వుండాలే కానీ, మరీ ఇంత వద్దు. గ్లామర్ ప్రపంచంలోకి రావడం అదృష్టం. మాకు దక్కిన వరం అనుకుంటాం. అలాగే అభిమానుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తాం. మరెవరూ ఇలాంటివి చేయకూడదు. తాజాగా బికినీలో వున్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో పెట్టాను. ప్రేక్షకులకు బాగా నచ్చుతాయని అలా చేశాను. కానీ ఆ ఫొటోలతో మరీ ఇంత అభిమానం హద్దులు మీరుతుందని అనుకోలేదు’’అంటూ చెప్పుకొచ్చింది సీరత్‌కపూర్. బికినీ ఫొటోలు పెట్టాలెందుకు?, ఇలా స్టేట్‌మెంట్‌లు ఇవ్వడమెందుకు? అని ప్రశ్నిస్తున్నారు పరిశ్రమకు చెందిన కొందరు. అదీ..సీరత్ తెలివి!