'క్లాప్' కొట్టు గురూ!

ఆమెకు ఆమే సాటి!! -- ‘క్లాప్’ కొట్టు గురూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ స్వీట్ హార్ట్ బేబీ అనుష్కశర్మ హవా రోజురోజుకీ పెరిగిపోతూనే వుంది. నటించిన చిత్రాల్లో ఆమె పాత్రల తీరుతెన్నులు.. ఎంపిక చేసుకుంటున్న బ్యానర్లు ఇలా ఎలా చూసుకున్నా ఆమెకు ఆమేసాటి అనిపించుకుంటోంది. అంతేకాదు, ఇటీవల ఆమెకు ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య కూడా బాగా ఊపందుకుందట. దాదాపు ఏడు మిలియన్‌ల వరకు ఫాలోవర్లు వున్నారట. ఇలా ట్విట్టర్‌లో ఇంత మంది అభిమానులను సంపాదించుకున్న అనుష్కశర్మ అంటే ఇప్పుడు తోటి నటీమణులు బెంబేలెత్తిపోతున్నారట. ఈ విషయం గురించి అనుష్కశర్మను కదిలిస్తే- ‘‘నిజంగా..నేను చాలా అదృష్టవంతురాలిని. నాకు ట్విట్టర్‌లో ఇంత ఫాలోయింగ్ లభించడం చూస్తుంటే నాకు నోట మాటలు రావడంలేదు. నేను ఈ సందర్భంగా నా ఫాలోవర్‌లందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక నా సహ నటీమణులందరితో నాకు మంచి స్నేహ సంబంధాలున్నాయి. నాకు లభిస్తున్న ఆదరణ చూసి వాళ్లు నాకంటే గొప్పగా ఫీలవుతున్నారు. ఇందులో అనుమానమేలేదు’’ అని గర్వంగా చెప్పుకొచ్చిన అనుష్కశర్మ ప్రస్తుతం కరణ్ జోహర్ దర్శకత్వంలో రానున్న ‘యే దిల్ హై ముష్కిల్’తో పాటు సల్మాన్‌కు జోడీగా ‘సుల్తాన్’లో విభిన్నమైన పాత్రలను పోషిస్తోంది. ఈ చిత్రాలే కాకుండా, ‘్ఫల్లోరీ’ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. అదీ..సంగతీ!!

వాహ్.. సోనాక్షి!
బాలీవుడ్ భామ, పాపులర్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. శత్రుఘ్నసిన్హా తనయగా వెండితెరపై అడుగుపెట్టిన ఈ సుందరాంగి అటు తర్వాత పోషించిన పాత్రల ద్వారా, చేసిన చిత్రాల ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. ఆ విధంగా ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లింది. అగ్ర హీరోలు సైతం తమ చిత్రాల్లో సోనాక్షియే వుండాలని ఉవ్విళ్లూరుతున్నారట! ప్రస్తుతం ఆమె చేతి నిండా చిత్రాలే చిత్రాలు.. ఇది ఇలా వుండగా తాజాగా సోనాక్షి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది. నిజంగా నిజం. నమ్మడం లేదా? ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో మహిళలందరితో ఒకేసారి తన గోళ్లకు రంగు వేసుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించింది. ‘‘నాకు చాలా ఆనందంగా వుంది. మహిళలందరితో పాటు పాల్గొన్న నాకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం లభించడం సంతోషాన్ని కలిగించింది’’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

‘సుప్రీమ్’్భమ!
ఢిల్లీ భామ రాశిఖన్నాకు టాలీవుడ్‌లో మంచి చిత్రాలు లభిస్తున్నాయి. మంచి చిత్రాలే కాదు, అంతకంటే గొప్ప బ్యానర్లు..పేరున్న హీరోలు తమ చిత్రాల్లో ఈ భామను ఎంపిక చేసుకుంటున్నారు. అతి తక్కువ సమయంలో ఇంతటి ఆదరణ పొందిన నటి మరొకరు లేరంటే ఆశ్చర్యం ఏం లేదు. తాజాగా సాయి ధరమ్‌తేజకు జోడీగా ‘సుప్రీమ్’లో ఆడిపాడుతోంది. ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇలా వరుస అవకాశాలతో దూసుకెళుతున్న రాశిఖన్నాను కెరీర్ ఎలా అనిపిస్తుంది? అని అడిగితే- ‘‘ఎంతో సంతోషంగా వుంది. నటిస్తున్న చిత్రాల్లో నా క్యారెక్టర్స్‌ను టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో రిసీవ్ చేసుకుంటున్నారు. తెలుగు చిత్రసీమ కూడా నన్ను బాగా ఆదరిస్తోంది. మంచి సినిమాలు..మంచి పాత్రలు ఇచ్చి ఎంతగానో ప్రోత్సహిస్తోంది. ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి?. ప్రస్తుతం నా కెరీర్ సాఫీగా సాగుతోంది. టాలీవుడ్ ప్రేక్షకుల రుణం తీర్చుకోలేను. నన్ను ఆదరిస్తున్న చిత్రసీమకు థాంక్స్’’ అంటూ ఎంతో హుషారుగా సెలవిచ్చింది. ఎంతో తెలివిగా సమాధానం చెప్పుకొచ్చిన రాశిఖన్నాకు టాలీవుడ్‌లో గిరాకీ పెరగనుందని, అగ్రతారల లిస్టులో చేరిపోవడం ఎంతో కాలం పట్టదని కూడా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. సో..బెస్ట్ఫా లక్ రాశీ!! అని మనమూ చెప్పకుండా వుండలేం కదా!!

-సమీర్