'క్లాప్' కొట్టు గురూ!

విరామం లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోల చిత్రాల్లో అతి తక్కువ సమయంలోనే అవకాశాలను చేజిక్కించుకొని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది అందాల భామ కాజల్ అగర్వాల్. దాదాపు పదేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆమె ఇమేజ్ చెక్కు చెదరలేదు. చాలా మంది గ్లామర్ చిందించినా పరిశ్రమలో ఎక్కువ కాలం నిలవలేకపోయారు. కానీ, కాజల్ అందుకు విరుద్ధంగా ప్రతిభను చూపి తనేంటో నిరూపించుకుంది. ప్రస్తుతం సౌత్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారి అందరి దృష్టిలో మరోసారి పడింది. అయితే తాజాగా కాజల్‌కు వస్తున్న అవకాశాల్లో చాలా వరకు ఆమె క్యారెక్టర్లకు ప్రాధాన్యం ఉండడంలేదని, వచ్చిన అవకాశాన్ని కాజల్ వదులుకోవడం లేదన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి కాజల్‌ని కదిలిస్తే- ‘‘నేను విమర్శలను ఏ మాత్రం పట్టించుకోను. కెరీర్‌లో ఎలా సాగిపోవాలో నాకు బాగా తెలుసు. పదేళ్లయినా నాకు ఇప్పటికీ మంచి అవకాశాలు అన్ని భాషల్లో వస్తున్నాయి. అది అదృష్టమే కాదు, నా ప్రతిభ కూడా. నేను ఈ విషయంలో కచ్చితంగా వుండగలను. నేను చేస్తున్న పాత్రలు అన్నీ నాకు నచ్చినవే. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎప్పుడూ నాకు కెరీర్‌లో విరామం లేదు. కృష్టపడుతూనే వుంటా’’ అని చెప్పుకొచ్చింది కాజల్. వాహ్..కాజల్ రియల్లీ గ్రేట్!

-సమీర్