'క్లాప్' కొట్టు గురూ!

కొత్త అవతారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ ‘దబాంగ్’ భామ సోనాక్షి సిన్హా రూటే వేరు. చేసే ప్రతి చిత్రంలో..పోషించే ప్రతి క్యారెక్టర్ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకోవడమేగాక ఆ పాత్ర తన కెరీర్‌కు ఎలా ఉపయోగపడగలదో కూడా బాగా ఒంట బట్టించుకుంటోంది. తండ్రికి తగ్గ తనయగా విశేష ప్రాచుర్యాన్ని అతి తక్కువ సమయంలోనే సంపాదించుకుంది. కెరీర్‌లో ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తింది. అదే..పాత్రికేయురాలిగా తన తాజా చిత్రం ‘నూర్’లో నటించబోతోంది. పాకిస్థానీ రచయిత్రి సబా ఇంతియాజ్ నవల ‘కరాచీయు ఆర్ కిల్లింగ్‌మి’ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. కరాచీలో వుండే ఆయేషా అనే ఇరవై ఏళ్ల పాత్రికేయురాలి కథ ఇది. అయితే ఈ ‘నూర్’కథ ముంబయి నేపథ్యంగా ఉణటుంది. ఈ చిత్రంలో నూర్‌రాయ్ చౌదరిగా సోనాక్షి కనిపించబోతోంది. ఈ విషయం గురించి సోనాక్షిని కదిలిస్తే- ‘‘ఇదొక చక్కటి క్యారెక్టర్. అనుబంధాలు, కెరీర్, ఉన్నత లక్ష్యాలు, సమస్యలు...ఇలా అన్నీ ఈ ‘నూర్’ జీవితంలో మనకు కనిపిస్తాయి’’అంటూ చెప్పుకొచ్చింది. సునీల్ సిప్పీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘అకీరా’, ‘్ఫర్స్-2’ చిత్రాలతో బిజీగా వున్న సోనాక్షి సిన్హా ఈ చిత్రం ద్వారా ఎలాంటి పేరును తెచ్చుకోనుందో చూడాల్సిందే!

-సమీర్