'క్లాప్' కొట్టు గురూ!

కోపమొచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాన్యంగా వివాదాలకు దూరంగా వుండే హన్సికను కూడా వివాదాల్లోకి లాగింది బిగ్‌బాస్ (హిందీ)లో కంటెంటెస్ట్‌గా చేసిన హీనాఖాన్. విషయంలోకి వెళితే ఉత్తరాది చిత్రాలకన్నా దక్షిణాది చిత్రాలలో ఎక్స్‌పోజింగ్ ఎక్కువగా వుంటుందని, అలా చేస్తేనే అక్కడి ప్రేక్షకులు చిత్రాలకు బ్రహ్మరథం పడతారని, అలా ఎక్స్‌పోజింగ్ చేసిన హీరోయిన్లను చూసి జాలిపడడం తప్ప మరేం చేయలేమని వ్యాఖ్యానించిందట హీనాఖాన్. దీంతో అందరూ స్తబ్దుగా వున్నా హన్సిక మాత్రం రెచ్చిపోయి హీనాఖాన్‌పై విరుచుకుపడింది. దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి ఆమెకు ఏం తెలుసని మాట్లాడుతోందని? బాలీవుడ్ నుంచి వచ్చిన అనేకమంది ఇక్కడ గొప్ప నటులుగా మారారన్న విషయం తెలియని ఆమెను చూసి జాలిపడుతున్నానంటూ చెప్పింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటినని తాను గర్వంగా చెప్పుకుంటానని, హీనాఖాన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చింది హన్సిక. మొత్తానికి హన్సికలో వున్న ఫైర్ దక్షిణాది చిత్రాలను తక్కువగా మాట్లాడినందువల్ల బ్లాస్ట్ అయింది. ఈ విధంగా హీనాఖాన్‌కు కూడా సోషల్ మీడియాలో మంచి అప్లాజూ వచ్చింది.