'క్లాప్' కొట్టు గురూ!

తమిళ క్రేజ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని అఖిల్ మొదటి చిత్రం ‘అఖిల్’తో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అయిన నటి సాయేషా సైగల్ ఆ తరువాత పూర్తిగా తమిళ పరిశ్రమపైనే దృష్టిపెట్టి అక్కడ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే తమిళంలో జయం రవితో కలిసి ‘వనమాగన్’ అనే సినిమా చేసిన ఆమె, ప్రస్తుతం విజయ్ సేతుపతి చేస్తున్న ‘జుంగా’ సినిమాలో నటిస్తూనే మరో క్రేజీ ఆఫర్‌ను దక్కించుకుంది. అదే హీరో ఆర్య సినిమా. కొద్దిసేపటి క్రితమే ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఆర్యతో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించింది. అందులో ఆర్య సరసన సాయేషాను హీరోయిన్‌గా ఖరారుచేశారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉండనున్న ఈ సినిమాను సంతోష్ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇలా తమిళంలో వరుసపెట్టి సినిమాలు చేస్తూ హిందీలో అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటోన్న సాయేషా తిరిగి తెలుగులో ఎప్పుడు నటిస్తుందో చూడాలి!