'క్లాప్' కొట్టు గురూ!

జోష్‌లో వుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటి సమంత ప్రస్తుతం మంచి జోష్‌లో వుంది. చేస్తున్న చిత్రాలు..సాధిస్తున్న విజయాలు...ఆమెను కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి తీసుకెళుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ ఆనందంలోనే ఇప్పుడు తేలియాడుతోంది ఈ భామ. తమిళంలో తెరి, 24 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకోవడమేగాక, నటిగా సమంతకు మంచి ఊపునిచ్చాయి. ఈ చెన్నై చిన్నది తాజాగా తెలుగులో నటించిన ‘అ ఆ’ మంచి విజయానే్న అందుకోవడంతో ఈ అమ్మడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘‘చిత్రసీమ నాకు మంచి అవకాశాలు కల్పిస్తోంది..అంతకంటే అభిమానులు నాపై మరింత ఆదరణ చూపిస్తున్నారు. దీంతో నాకు అవకాశాలకు కొదవలేకుండా పోతోంది. నా కెరీర్ ఇలా సక్సెస్ బాటలో పయనించడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది ఈ ఆదరణ నాపై ఇలాగే వుండాలని కోరుకుంటున్నా’’అంటూ చెప్పుకొచ్చింది ఇటీవల ఓ సందర్భంలో. నిజమే..మరి మంచి విజయాలు ఏ నటికైనా ఇంతటి ఆనందానే్న కలిగిస్తాయి. అది సరే..మరి పెళ్లి మాటెత్తితే రివ్వును పరుగెడుతుంది ఎందుకో..అంటూ అందరూ వాపోతున్నారట. అదీ..సంగతీ!!

-సమీర్