'క్లాప్' కొట్టు గురూ!

దటీజ్..ఖన్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో ఇప్పుడు ఏ నోట విన్నా రాశీఖన్నా పేరే..! అతి తక్కువ కాలంలో అందరి నోళ్లలో నానుతున్న ఈ పేరుకు భలే క్రేజ్ ఏర్పడింది. రాశీఖన్నా వరుస అవకాశాలతో మంచి ఊపుమీదుండడంతో ఇతర తారలకు..ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ భామలకు మింగుడు పడడంలేదట. చేస్తున్న చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ పోషిస్తున్న పాత్రలు వేటికవే భిన్నంగా ఉండడమే కాదు, అటు గ్లామర్..ఇటు పెర్‌ఫార్మెన్స్ పరంగానూ తనకు తానేసాటి అనిపించుకుంటూ కెరీర్‌లో రివ్వున దూసుకెళుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొనే మార్గంలో ఇప్పుడు రాశీఖన్నా యమబిజీగా వుంది. హీరోయిన్ల కెరీర్ కాలం చాలా తక్కువ అన్న విషయం రాశీకి తక్కువ టైమ్‌లోనే తెలిసొచ్చినట్టుంది. నెంబర్ వన్..టూ అంటూ అర్రులు చాచకుండా తనదైన మార్గంలో పయనిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఫలితంగానే మంచి ఇమేజ్..అంతకంటే మంచి అవకాశాలు ఆమెను వరిస్తున్నాయి. ‘‘పరిశ్రమలో నేనేదో బాగా సంపాదించేసి, నెంబర్ వన్నో..టూనో అనిపించుకోవాలన్న అత్యాశ నాకు లేదు. హీరోయిన్ల కెరీర్ గురించి నాకు బాగా తెలుసు. ఉన్నంత కాలం మంచి సినిమాలు..మరిన్ని మంచి పాత్రలు చేసి నటిగా నాకంటూ ఓ ప్రత్యేకత నిలుపుకోవాలన్నదే నా తపన. నా గురించి తోటి తారలేమనుకున్నా పట్టించుకోను. నా కెరీర్ నాదే’’అంటూ ఎంతో తెలివిగా చెప్పుకొచ్చింది. దటీజ్..ఖన్నా!!

-సమీర్