'క్లాప్' కొట్టు గురూ!

రేష్మీ..రేష్మీ...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అని యువతరం ఎప్పుడు అంటుందో ఏమో అని అనుకుంటున్నారా? ‘అంత సీన్ లేదులే’ అంటున్నారు టాలీవుడ్ జనాలు. టీవీ యాంకర్‌గా ఎంతో పాపులర్ అయిన రేష్మి తన అందచందాలతో..పదునైన మాటలతో బుల్లితెర ప్రేక్షకులను ‘జబర్‌దస్త్‌గా’ తనవైపునకు ఆకట్టుకునేలా చేసింది. అయితే అంతటితో ఆగకుండా, మరో అడుగు ముందుకేసి వెండితెరపై తన ప్రతిభను చూపడానికి సిద్ధమయింది. ‘గుంటూర్ టాకీస్’లో హాట్ హాట్‌గా, గ్లామర్‌ని చిందించి అందాల ఆరబోతను ప్రదర్శించింది. ఆ చిత్రంలో రేష్మీ నటనకు స్కోప్‌లేదు. దాంతో ఆమెకు పెద్దగా గుర్తింపురాకుండా పోయింది. ఇక ఇప్పుడు చూడండి తన తడాఖా అంటూ ‘అంతం’ ద్వారా మరో ఛాన్స్ ఇచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం పోస్టర్లు విడుదలయ్యాయి. ఇందులో రేష్మీని చూసిన యువత సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారట. సస్పెన్స్, థ్రిల్లర్‌తో సాగే ఇందులో ఈ భామ అందాలు విరజిమ్మిందట. అందుకే సెన్సార్‌వారు ‘పెద్దలకు మాత్రమే’ అంటూ ‘ఎ’ సర్ట్ఫికెట్ కూడా ఇచ్చారట. దాంతో ఈ చిత్రంపై మరింత క్రేజ్ పెరిగింది. మంచి ఫ్యాన్సీరేట్లకు కూడా చిత్రం అమ్ముడుపోయింది. ‘దటీజ్...రేష్మీ’ .

-సమీర్