'క్లాప్' కొట్టు గురూ!

సంచలన తార!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో వచ్చిన ‘ద డర్టీపిక్చర్’, ‘కహానీ’ చిత్రాలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఈ వైవిధ్యభరితమైన చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి నటిగా నూటికి నూరుపాళ్లు తన పాత్రలకు న్యాయం చేసి అందరిచేత ‘వాహ్..’ అనిపించుకుంది నటి విద్యాబాలన్. తాజాగా విద్యా బాలన్ ఇండియన్-ఇంగ్లీష్ నవలా రచయిత కమలాదాస్ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న చిత్రంలో నటిస్తోంది. ఇందులో గొప్ప అభ్యుదవాదిగా కనిపించనుందట. ఇలాంటి పాత్రలను ఎలా ఎంచుకుంటారు? అని కొందరు ఆమెను కదిలిస్తే- ‘‘మసాలాలతో నిండిన చిత్రాలకు ఆదరణ వుంటుందనేది సత్యమే కానీ, ఇది దురదృష్టకరమైన విషయమే. ఇలాంటి చిత్రాలు ఎక్కువ కాలం నిలబడవు. ఇందులో నటించిన నటీనటులకు పేరు అనేది స్వల్పకాలమే రావొచ్చేమో..కానీ కెరీర్ నిలవదు. తాజాగా నేను నటిస్తున్న చిత్రంలో రచయిత కమలాదాస్ పాత్రలో కనిపించనున్నా. ఆమె గొప్ప అభ్యుదయవాది. ఆమె వ్యక్తిగతంగా మాత్రమే నాకు తెలుసు. అంత గొప్ప అభ్యుదయవాది గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా. అందుకే ఈ చిత్రం చేస్తున్నా. ఇలాంటి చిత్రాల్లో నటిస్తే నటిగా తప్పియే కాదు, కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోతుంది. నాకు కావలిసింది అదే’’అంటూ చెప్పుకొచ్చింది విద్య.

-సమీర్