'క్లాప్' కొట్టు గురూ!

క్రేజీ భామ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘బాలీవుడ్.. హాలీవుడ్ అంటూ కూర్చుంటే కెరీర్ ముందుకు సాగదు. ఎక్కడైనా చేసే క్యారెక్టర్ ఎలాంటిది..నటించే సినిమా స్టామినా ఏమిటి? అన్నదే ముఖ్యం. ఏ నటి అయినా తెలుసుకోవలసింది ఇదే’’అంటూ కొత్త తరహాలో అవకాశం వచ్చిన చోటల్లా చెప్పుకొస్తుంది అందాల భామ ప్రియాంక చోప్రా. ‘క్యాంటికో’ సీరిస్ తచ్చిన క్రేజ్‌తో వచ్చిన ‘బేవాచ్’ చిత్రం అవకాశాన్ని తనదైన శైలిలో ఇరగదీసింది. ‘క్యాంటికో’లో ట్రైనీ ఎఫ్‌బిఐ ఏజెంట్‌గా, బాలీవుడ్ చిత్రం ‘జై గంగాజల్’లో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా ప్రియాంక చూపిన ప్రతిభ అంతా ఇంతా కాదు. ఆ ప్రతిభతోనే ‘బేవాచ్’లోనూ అవకాశాన్ని పొందింది. హాలీవుడ్‌లో ఇలా వరస చిత్రాలు చేస్తూ హాలీవుడ్ నటిగా స్థిరపడిపోయింది. ‘‘బాలీవుడ్..హాలీవుడ్ అంటూ రెండ పడవల ప్రయాణం ఎలా వుంది? అని అందరూ నన్ను అడుగుతున్నారు. నాకు ఇవి రెండు కళ్లలాంటివి. బాలీవుడ్‌లా హాలీవుడ్‌లోనూ నా ప్రతిభ చూపాలనుకుంటున్నా. ఏదో సాధించేద్దామని నేను ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడకు రాలేదు. వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకొని నా ప్రతిభను చూపాలన్నదే నా తాపత్రయం’’ అంటోంది ప్రియాంక. వాహ్.. ప్రియాంక రియల్లీ..గ్రేట్!!

-సమీర్