'క్లాప్' కొట్టు గురూ!

మరోతార!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ తారలు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం కొత్తేం కాదు. అలాగే టాలీవుడ్ భామలు కూడా బాలీవుడ్‌కి పరిచయం కావడం కూడా. ఇలా రెండు చోట్లా కూడా చిత్రాలు చేస్తూ తమకంటూ ప్రత్యేకతను నిలుపుకుంటున్న తారలు ఎందరో..! అలా ఇప్పుడు కొత్తగా మరోతార టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది! ఆమే అమైరా దస్తూర్. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీలాంటి హీరోలతో కొన్ని చిత్రాలు చేసి నటిగా మంచి మార్కుల్నే కొట్టేసిన ఈ సుందరాంగికి టాలీవుడ్ అవకాశం తలుపుతట్టిందట. రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న ‘రాజుగాడు’లో అమైరా నటించనున్నట్లు తెలిసింది. మారుతి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను సమకూరస్తుండగా, సుంకర రామబ్రహ్మం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంజనారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణను కూడా మొదలు పెట్టుకుంది. బాలీవుడ్‌లో మంచి పాత్రలతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన ఈ అమ్మడుకి టాలీవుడ్ ఎలాంటి కెరీర్‌ను ఇస్తుందో చూడాల్సిందే మరి! ఆల్ ది బెస్ట్ అమైరా!!

-సమీర్