'క్లాప్' కొట్టు గురూ!

దటీజ్.. బిపాసా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో థ్రిల్లర్లు..హారర్లులాంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సృష్టించుకున్న నటి బిపాసాబసు. ఈ బ్యూటీ నటించిన ప్రతీ చిత్రంలోనూ హీరోకు ధీటుగా తన క్యారెక్టర్ వుండేలా చూసుకుంది. అలాంటి జాగ్రత్తలు తీసుకోబట్టే ఇన్నాళ్లు కెరీర్ హాయిగా సాగింది. బిపాసాకు వివాదాలు కూడా కొత్తేం కాదు. ఓ సారి డినో మొరియా, మరోసారి జాన్ అబ్రహాంతో పీకలోతు ప్రేమల్లో మునిగితేలిన ఈ భామ అటు తర్వాత హర్మాన్ బవేజాతోనూ ప్రేమాయణం సాగించినట్లు పుకార్లు షికార్లు చేశాయి. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ కరణ్‌సింగ్ గ్రోవర్‌తో పెళ్లి పీటలెక్కింది. అయినా తనకు కెరీర్‌కు మీద ధ్యాస తగ్గలేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఆలోచిస్తూ..మరో అడుగు ముందుకేయడంలోనే ఆసక్తి కనబరుస్తోంది. గతంలో బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికాలు తీసుకున్న నటీమణుల్లో బిపాసా కూడా ఒకరన్న విషయం తెలిసిందే. సెక్స్‌సింబల్‌గా పేరు తెచ్చుకున్న బిపాసాను ఎప్పుడూ వివాదాల్లో ఎందుకుంటారని కదిలిస్తే- ‘‘ఏ నటికైనా ఇలాంటి వివాదాలు కొత్తేంకాదు. ముఖ్యంగా అగ్ర స్థానానికి ఎదిగిన తారామణులకు ఇది తప్పనిదే. అలా అని వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోలేం కదా? మన కెరీర్ మనదే. ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను అస్సలు పట్టించుకోలేదు. ఎవరి ఏడుపు వారిది అని ఊరుకున్నాను. ఇప్పటికీ నేను అంతే! ఇన్నాళ్లకు మళ్లీ నన్ను వివాదాల్లోకి లాగుతున్నారు. ఐ డోంట్ కేర్’’అంటూ బిపాసా ఎంతో కూల్‌గా సమాధానం చెప్పి తప్పించుకుంది. దటీజ్..బిపాసా!!

-సమీర్