'క్లాప్' కొట్టు గురూ!

స్టార్..స్టార్,,!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్..స్టార్ అంటున్నారు ఇప్పుడు అనుష్కశర్మను చూసి బాలీవుడ్. ‘పీకే’ చిత్రంతో స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ తాజా చిత్రం ‘సుల్తాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దాంతో మరోసారి అనుష్కకు భలే క్రేజ్ వచ్చింది. ‘సుల్తాన్’తో వచ్చిన క్రేజ్‌తో ఇప్పుడు బాలీవుడ్‌లో అగ్ర కథానాయికల లిస్టులో చేరిపోయింది. వీటికంటే ముందు షారుఖ్‌ఖాన్ ‘రబ్ నే బనాదీ జోడీ’, ‘జబ్‌తక్ హై జాన్’లో వెరైటీ పాత్రల్లో జీవించింది. ఖాన్‌త్రయంతో చేసిన ప్రతీ చిత్రంలో ఈ భామకు మంచి క్యారెక్టర్సే లభించాయి. స్టార్‌ల సరసన చేసే హీరోయిన్ల పాత్రలకు పెద్దగా గుర్తింపు వుండదు. కానీ అనుష్కకు మాత్రం అదృష్టం కొద్దీ మంచి పాత్రలే లభించాయి. అలా వచ్చిన పాత్రలను అనుష్క ఇరగదీసిందనే చెప్పొచ్చు. స్టార్ ఇమేజ్ ఎలా అనిపిస్తుంది అని అనుష్కను కదిలిస్తే- ‘‘నేనెప్పుడైనా ఎంపిక చేసుకునే చిత్రంలో కథ, అందులో నా క్యారెక్టర్.. తర్వాత దర్శకుడు ఎవరనేది ఆలోచిస్తాను. అలా ఆలోచించాకే ఓ నిర్ణయానికి వస్తాను. అలా తీసుకున్న నిర్ణయాలే నాకు మంచి ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. ‘సుల్తాన్’ భారీ విజయాన్ని అందుకోవడం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ నా క్యారెక్టర్‌ను తీర్చిదిద్దిన తీరు అమోఘం. ఆ పాత్రలో జీవించే అవకాశం నాకు దర్శకుడు కల్పించారు. అందుకే ఆ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది’’అంటూ ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చింది అనుష్క.