'క్లాప్' కొట్టు గురూ!

దటీజ్.. చోప్రా!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా గురించే ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. ఆమె తాజాగా నటించిన ‘డిషూమ్’ చిత్రంలోని ‘జానే మన్ ఆ..’పాట ఎక్కడ విన్నా మారుమోగిపోతోంది. ఈ పాటపై వరుణ్‌ధావన్‌తో జతకట్టిన పరిణితి పండించిన కెమిస్ట్రీ అంతా ఇంతా కాదు అంటున్నారు బాలీవుడ్ జనాలు. ‘డిషూమ్’లో ప్రత్యేక గీతమైన ఈ పాట అందరి నోళ్లలో అంతగా నానడానికి కారణం పరిణితి-వరుణ్‌ల లిప్‌లాకేనని చెప్పుకుంటున్నారు. పాట మొదట్లో వెరైటీ స్టెప్పులతో ఇరగదీసిన ఈ జంట పాట చివరలో వచ్చిన లిప్ టు లిప్‌లాక్ సన్నివేశం చూసే ప్రేక్షకులను మరింత రక్తికట్టించిందట. ఈ లిప్‌లాక్ వెనక బోలెడంత కథే నడిచిందట. ఆ కథేమిటో ఈ బ్యూటీనే అడిగతే- ‘‘ ఈ పాట బాగా ప్రజాదరణ పొందిన మాట వాస్తవం. అయితే ఇది లిప్‌టులిప్ సన్నివేం ముందుగా అనుకోలేదు. అనుకోకుండా వరణ్‌ధావన్‌కి వచ్చిన ఆలోచన ఇది. ఇలా చేస్తే సినిమాకు భలే క్రేజ్ వస్తుందన్న అతడి ఆలోచన నిజమైంది. దాంతో ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే. వరుణ్ నాతో ఇలా చేద్దాం అని చెబితే..ఆలోచించా. బావుంటుందనిపించింది. చేసేశా. అయినా ఇందులో తప్పేముంది? చిత్రానికి హెల్ప్ చేయాలన్న మా ఆలోచన నిజమైందే కదా అనిపించింది. చాలా సంతోషంగా వుంది. మా ఆలోచన నిజమైన విజయాన్ని అందించినందుకు’’అని సెలవిచ్చింది. దటీజ్..చోప్రా!!