'క్లాప్' కొట్టు గురూ!

జోరుగా.. హుషారుగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జోరుగా..హుషారుగా షికారు చేద్దామా..హాయి హాయిగా..’ అంటూ భలే హుషారైన జోష్‌తో అందర్నీ అలరిస్తోంది అందాల భామ రాశీఖన్నా. టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే భలే క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ‘సుప్రీమ్’తో ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీకి మంచి మంచి అవకాశాలు.. టాప్ హీరోల సరసన ఆడిపాడే ఛాన్స్ దక్కుతోంది. తాజాగా గోపీచంద్‌తో ఓ చిత్రం చేస్తోంది. టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో ముందుకు దూసుకెళుతున్న ఈ బ్యూటీ కెరీర్ ప్రస్తుతం మంచి ఊపుమీదుంది. అగ్రహీరోలు కూడా తమ చిత్రాల్లో రాశీఖన్నాకు చోటివ్వడానికి ముందుంటున్నారట. ఇంతటి క్రేజ్ ఎలా అనిపిస్తోంది? అని రాశీని కదిలిస్తే- ‘‘వెంట వెంటనే అత్యధిక చిత్రాలు చేసి పెద్ద స్టార్‌ని అయిపోవాలన్న అత్యాశ నాకు లేదు. వచ్చిన అవకాశాల్లో మంచివి అనుకున్నవే చేస్తున్నా. టాలీవుడ్‌లో నాకు లభిస్తున్న ఆదరణ, ప్రేక్షకుల్లో నాకు కలిగిన అభిమానం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇంతటి ఆదరణకు నేనెంతో సంతోషంగావున్నా’’అంటూ చెప్పుకొచ్చింది రాశీ. త్వరలోనే రాశీ టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకోవడం ఖాయం అని అంతా అంటున్నారు. వాహ్..రాశీ!!

-సమీర్