'క్లాప్' కొట్టు గురూ!

ప్చ్..అమలాపాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతో ఇష్టపడి..పైగా ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకున్న చాలా మంది తారల జీవితాలు తొలి అడుగులోనే నిర్వీర్యమైపోతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే తమిళ దర్శకుడు విజయ్‌తో పీకలోతు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న తార అమలాపాల్. ఈ జంట చూస్తుండగానే విడిపోతున్నారు. వీరిపై చాలా సార్లు పుకార్లు షికార్లు చేశాయి. వీటన్నింటికి ఫుల్‌స్టాప్ పెడుతూ విడిపోతున్న విషయం పుకారు కాదని, నిజమైనదేనంటూ దర్శకుడు విజయ్ ఇటీవల తేల్చేశారు. 2014లో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లయినా పూర్తవ్వకముందే విడిపోతున్నారు. కొంత కాలంగా వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయట. కారణాలు ఏమైనా విడిపోతున్నమాట వాస్తవం. ‘ఈ విషయంలో ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవలసిన అవసరం లేదు’ అంటూ దర్శకుడు చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటి వాటిని కొట్టిపారేస్తూ అమలా మీడియా నుంచి తప్పించుకు తిరుగుతోందిట. ప్చ్..అమలాపాల్!!