'క్లాప్' కొట్టు గురూ!
గ్లామరే రక్ష!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అందాలతార రకుల్ ప్రీత్‌సింగ్‌కు గ్లామరే రక్షగా మారింది. టాలీవుడ్‌కి పరిచయమైన అతి తక్కువకాలంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ అంతే జోరుగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. అగ్ర హీరోలు సైతం తమ చిత్రాల్లో రకుల్‌నే ఎంచుకుంటున్నారంటే ఆమె క్రేజ్ ఎలా పెరిగిపోయిందో ఇట్టే అర్థమవుతోంది. వరస అవకాశాలతో యమబిజీగా వున్న ఈ అమ్మడి డైరీ ప్రస్తుతం ఖాళీగా లేనేలేదట. రకుల్ సైతం వచ్చిన అవకాశాలను ఏ మాత్రం వదులుకోకుండా ఆచి తూచి అడుగులు వేస్తూ తన గ్లామర్‌తో యువతరాన్ని తనవైపునకు తిప్పుకునే ప్రయత్నంలో పడిదంట. దర్శక, నిర్మాతలు సైతం రకుల్వైపే మొగ్గు చూపుతున్నారట. అయితే రకుల్ ఇప్పటి వరకు చేసిన చిత్రాలు..రాబోయే చిత్రాల్లో తన పాత్ర తీరుతెన్నుల విషయంలో ఏ మాత్రం మార్పులేనేలేదు. అన్నీ గ్లామర్‌తో కూడినవే. ఏ చిత్రంలోనూ వైవిధ్యానికి ప్రాధాన్యం లేదు. గ్లామర్‌ని నమ్ముకుంటే ఎంతకాలం చిత్రసీమలో నిలబడగలదో రకుల్‌కు తెలియనట్లుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయం గురించి రకుల్‌ని కదిలిస్తే- ‘‘చిత్రసీమలో నాటి నుంచి నేటి వరకు వచ్చిన తారల కెరీర్లను చూశాం. చూస్తూనే వున్నాం. నేడు హీరో చుట్టే కథలు తిరుగుతున్నాయ్..హీరోయిన్లను అందాల భామలుగానే చూపిస్తున్నారు. ఎక్కడో ఒకటీ..ఆరా తప్ప అన్నీ హీరో చుట్టేతిరిగే కథలే. ఇలాంటి పరిస్థితుల్లో ఏ హీరోయిన్ అయినా మడికట్టుకుని కూర్చుంటే ప్రయోజనం ఏంటి? ఉన్నంతలో గ్లామర్‌ని చిందిస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నదే నా తాపత్రయం. కథానాయికల కాలం మనకు తెలియంది కాదు. ఏదో సాధిద్దాం..కెరీర్లో ఉన్నత శిఖరాలు అధిరోహిద్దాం అనే దానికి కాలం చెల్లింది’’అంటూ సుదీర్ఘంగా చెప్పుకొచ్చింది. ఇంతకీ..రకుల్ ఏమంటుందటారు? గ్లామర్‌ని వదలేది లేదనా?! ప్చ్..రకుల్!!