'క్లాప్' కొట్టు గురూ!

క్రేజీ భామ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలో భలే క్రేజ్‌ని సంపాదించుకున్న తారల్లో రాశీఖన్నా కూడా చేరిపోయింది. చేసినవి కొద్ది చిత్రాలే అయినా అవి ఈ గ్లామర్ భామకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అంతేకాదు, గ్లామర్ బ్యూటీ అని కూడా పిలిపించుకుంటోంది. తాజాగా గోపీచంద్‌తో కలిసి ‘ఆక్సిజన్’ అనే చిత్రంలో ఆడిపాడుతోంది. అలాగే రామ్‌తో ‘హైపర్’లోనూ జతకట్టింది. ఇలా వరుస అవకాశాలతో టాలీవుడ్‌లో తిరుగులేని తారగా మారింది. కెరీర్ ఎలా వుంది అని రాశీఖన్నాను కదిలిస్తే- ‘‘వాహ్..చెప్పలేనంత ఆనందంగా వుంది. మంచి చిత్రాల్లో మంచి క్యారెక్టర్లు చేసే అవకాశం లభిస్తోంది. అంతేకాదు..హీరోలు కూడా నాకు మంచి సహకారాన్ని అందిస్తున్నారు. అయితే అందరూ గ్లామర్..గ్లామర్..అంటున్నారు. అవును. నిజమే..గ్లామర్ అనేది చిత్రాల్లో తప్పదు. గ్లామర్‌ని ప్రదర్శించడం అన్నది ఈ వయసులోనే కదా? నాకు మాత్రం అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. నటనకు అవకాశమున్న పాత్రలు చేస్తూనే గ్లామర్‌ని మిస్సవను. నా ముందు ఎన్నో లక్ష్యాలు వున్నాయి.. మరెన్నో ఆశయాలూ వున్నాయి. నచ్చిన ప్రాతలు పోషిస్తూనే నా లక్ష్యాలను నెరవేర్చుకుంటా’’అంటూ ఎంతో తెలివిగా సెలవిచ్చింది ఖన్నా!!

-సమీర్