'క్లాప్' కొట్టు గురూ!

ఖతర్‌నాక్ ‘కైఫ్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్ అంటేనే ఎప్పుడూ ఓ సంచలనమే. చేసే చిత్రాలేకాదు, పోషించే పాత్రల్లోనూ ఆమె ఓ సంచలనమే! కత్రీనాపై వచ్చినన్ని రూమర్స్ మరే బాలీవుడ్ తారపై రాలేదంటే ఆలోచించాల్సిందే మరి! కత్రీనా వర్సెస్ మీడియా ఇలా వీరిద్దరి మధ్య ఎన్నో వివాదాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. ఎప్పుడూ హాట్ హాట్‌గానే వార్తలు గుప్పుమన్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కెరీర్‌లో ఎన్నో చూసింది. మరెన్నో సంచలనాలు సృష్టించింది. అయినా వాటిని ఈ భామ ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రతీ దాన్ని ‘ఐ డోంట్ కేర్’ అంటూ తేలిగ్గా కొట్టిపారేసింది. బాలీవుడ్ హీరోలతో ప్రేమాయణం నడిపిస్తుందని ఎన్నోసార్లు పుకార్లు షికారు చేశాయి. వీటి గురించి కత్రీనాను కదిలిస్తే- ‘‘ఇవన్నీ మామూలే. నేను ఏ మాత్రం రూమర్స్ గురించి పట్టించుకోను. అలా పట్టించుకుంటే కెరీర్‌లో టైమ్‌వేస్ట్ చేసినట్టవుతుందన్నది నా నమ్మకం. చాలా మంది హీరోలతో నా ప్రేమాయణం అంటగట్టి మీడియా పబ్బం గడుపుకుంది. అవన్నీ పెద్ద ట్రాష్ అని అందరికీ తెలుసు. ఆ రూమర్స్‌లో ఎంత నిజముందో పరిశ్రమకూ తెలుసు. అందుకే రూమర్స్ విషయంలో నేను అలా వ్యవహరిస్తాను’’అంటూ చెప్పుకొచ్చింది. నిజమే..ఖతర్‌నాక్ కైఫే మరి! ఏ మంటారు?!

-సమీర్