'క్లాప్' కొట్టు గురూ!

నిలదొక్కుకుంటా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో నిలదొక్కుకుంటానంటోంది అందాల తార తాప్సీ. టాలీవుడ్, కోలీవుడ్‌లో గ్లామర్ పాత్రలతో అందర్నీ ఆకట్టుకున్న ముద్దుగుమ్మ తాప్సీ టార్గెట్ బాలీవుడ్డేనట. వినడానికి ఆశ్చర్యంగా వున్నా..ఇది నిజమేనట. తెలుగులో ముఖ్యంగా తన గ్లామర్‌తో యువతను కట్టిపడేసిన ఈ సుందరాంగి కెరీర్ చూస్తున్నంతలోనే అడ్రస్ లేకుండా పోయింది. తాజాగా బాలీవుడ్‌లో ‘పింక్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో బిగ్‌బి అమితాబ్ నటిస్తున్నారు. ‘‘తెలుగులో మంచి పాత్రలు చేశాను. నటనతో అందర్నీ గెలుచుకున్నా. అలాగే బాలీవుడ్‌లో ఎలాగైనా నెట్టుకొస్తానన్న గట్టి నమ్మకం నాకుంది. ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నా. ఇప్పుడిప్పుడే మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. చాలా మంది దర్శక, నిర్మాతలు కలిశారు. నా క్యారెక్టర్ గురించి చెప్పారు. త్వరలోనే మరో మూడు సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాను. ఆ చిత్రాలు పూర్తయి ప్రేక్షకుల ముందుకొస్తే బాలీవుడ్‌లో నేననుకున్న టార్గెట్‌కు చేరువవుతానన్న ఆశ..నమ్మకం నాలో బలంగా వుంది’’అంటూ చెప్పుకొచ్చింది అందాలభామ తాప్సీ. మరి..మీరేమంటారు?! సరేలే..ఎవరి ఆశ వారికుంటుంది మరి!

-సమీర్